Hyderabad to Vijayawada : ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు రైలులో వెళ్లేందుకు సగటున 4.30 గంటల టైం పడుతోంది. ఈ జర్నీ టైం గంట అయితే.. ఎలా ఉంటుంది ? భలేగా ఉంటుంది కదా !! రాబోయే కొన్నేళ్లలో తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ – విజయవాడ లాంటి దేశంలోని అన్ని కీలకమైన రూట్ల మధ్య నడిపేందుకు హైస్పీడ్ రైళ్లను రైల్వే శాఖ రెడీ చేయిస్తోంది. అవి గంటకు 280 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తాయి. రైల్వే రూట్ ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడకు 313 కి.మీ దూరం ఉంది. అంటే.. హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాక మనం సగటున గంటన్నరలోగా హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుంటాం. టికెట్ ఛార్జీలు కొంత ఎక్కువే ఉంటాయి. విలువైన సమయాన్ని ఆదా చేసుకోవాలని భావించే వారు, త్వరగా వెళ్లాల్సి ఉన్నవారు, వ్యాపారులు, ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారు తప్పకుండా ఆ ట్రైన్లను ప్రయాణిస్తారు. అత్యవసర వైద్యం అవసరమైన రోగులకు ఈ ట్రైన్లు బాగా ఉపయోగపడనున్నాయి. హైస్పీడ్ రైళ్లలో అన్నీ ఛైర్ కార్సే ఉంటాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాలంటే ఒక వ్యక్తికి దాదాపు రూ.2,500 దాకా ఖర్చవుతుంది. 1 గంట 15 నిమిషాల్లోగా అక్కడికి చేరుకోవచ్చు. హైస్పీడ్ రైలు(Hyderabad to Vijayawada) కూడా అంతే సమయంలో మనల్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరవేస్తుంది.విమానం టికెట్‌లో సగం రేటుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లొచ్చు.
Also Read :Viral : పబ్లిక్ లో బ్రా వేసుకొని రీల్స్.. జనం చూస్తూ ఊరుకుంటారా..!!
ఫీచర్లు ఇవీ..
- భారత ప్రభుత్వరంగ సంస్థ ‘భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్’ (బీఈఎంఎల్)తో రైల్వేశాఖ కలిసి చెన్నైలోని రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో హైస్పీడ్ రైళ్లను ప్రస్తుతం తయారు చేస్తున్నారు.
- ఈ రైలులో ఒక్కో బోగీ తయారీకి రూ.28 కోట్ల దాకా ఖర్చవుతోంది.
- ఈ రైళ్లు చాలా స్పీడుగా ప్రయాణించేందుకుగానూ.. వాటి బోగీలలోకి గాలి చొచ్చుకుపోకుండా ఏర్పాట్లు చేస్తారు.మొత్తం రైలు బాడీ నిర్మాణం.. గాలి చొరబడని విధంగా ఉంటుంది.
- హైస్పీడ్ రైళ్లకు ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. ఈ డోర్స్ నుంచి లోపలికి గాలి వెళ్లదు.
- ఈ రైళ్లలో బోగీకి బోగీకి మధ్య కనెక్టివిటీ ఉంటుంది.
- ఏసీ ఏర్పాట్లు ఉంటాయి.
- సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.