Site icon HashtagU Telugu

India’s First Sky Deck: హైదరాబాద్ లో ‘స్కై డెక్’ ప్రాజెక్టు.. దేశంలోనే మొదటిసారిగా!

Sky Deck

Sky Deck

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ రాయదుర్గంలో భారతదేశపు మొట్టమొదటి స్కై డెక్ ప్రాజెక్ట్‌ను రాబోతోంది. నగరానికి చెందిన రాఘవ ప్రాజెక్ట్స్ ప్రారంభించింది. రాయదుర్గం నుండి గచ్చిబౌలి వరకు 7.38 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో మూడు టవర్లు, ఒక్కొక్కటి 45 అంతస్తులు ఉంటాయి. ఒక్కో అంతస్తులో 5500-6600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు ఫ్లాట్లు ఉంటాయి.

సింగపూర్‌లోని మెరీనా బే స్ఫూర్తితో కిమ్స్ ఆసుపత్రికి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుండి నిర్మాణ అనుమతులను పొందింది. అంతే కాకుండా తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా)లో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు జూబ్లీ హిల్స్ సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ స్కైలైన్‌ను కొత్త శిఖరాలకు చేర్చుతుంది.