CWC Meeting: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పాతబస్తీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అలీ బిన్ ఇబ్రహీం మస్కతీ ఆదివారం హైదరాబాద్‌లోని సిడబ్ల్యుసి సమావేశం వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వెంట ఆయన కార్యకర్తలు, టీపీసీసీ ముస్లిం నేతలు కూడా ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో లాంఛనంగా పార్టీలో చేరారు.
మస్కతీ కుటుంబం చాలా కాలంగా స్థానిక రాజకీయాలతో ముడిపడి ఉంది. అలాగే ఓల్డ్ సిటీలో వాళ్లకు పలుబడి బాగానే ఉంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ నుంచి అలీ మస్కతీ కాంగ్రె తరుపున బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. 2015లో మరణించిన అలీ మస్కతీ తండ్రి ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ AIMIM ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు పర్యాయాలు పనిచేశారు. అలీ మస్వతి 2002లో టీడీపీలో చేరి ఎమ్మెల్సీగా, ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
Also Read: SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. వారే అర్హులు..!