Sadhguru: సద్గురు గ్రీన్ ఇండియా ఛాలెంజ్- 5.0

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంతటా మంచి స్పందన వస్తోంది.

  • Written By:
  • Updated On - June 17, 2022 / 01:20 PM IST

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంతటా మంచి స్పందన వస్తోంది. సామాన్యుల, సెలబ్రిటీలు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటుతూ, పచ్చదనం ఆవశ్యకత గురించి వివరిస్తున్నారు. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. “తెలంగాణలో పచ్చదనం పెంపుకోసం పాటుపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశంలోనే రోల్ మోడల్. ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదు. భవిష్యత్ తరాల కోసం దాన్ని కాపాడుకోవాలి” అన్నాడు సద్గురు

భారతదేశాన్ని పచ్చదనంగా మార్చేందుకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ప్రారంభించడం అభినందనీయమని ఆయన తెలిపారు. సద్గురు మాట్లాడుతూ ‘తెలంగాణకు హరిత హారం’, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశంలోనే రోల్ మోడల్‌గా నిలిచాయని, మిగతా అన్ని రాష్ట్రాలు సవాలును స్వీకరించాలని సూచించారు. తెలంగాణలోకి అడుగుపెట్టగానే పచ్చని పరిసరాలను చూసి తన్మయత్వం పొందానని వాసుదేవ్ అన్నారు. భూమికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. భవిష్యత్ తరాలకు కానుకగా భూమిని, మట్టిని పరిరక్షించాలని ఆయన బలంగా ఆకాంక్షించారు.

సేవ్ సాయిల్ ఉద్యమంలో భాగంగా గురువారం (నేడు) హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వాసుదేవ్ యాత్ర ప్రారంభించారు. మార్గమధ్యంలో ఆధ్యాత్మిక గురువు శంషాబాద్‌లోని గొల్లూరు అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్-5.0 ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ జే సంతోష్ కుమార్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, డి విట్టల్ పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలంగాణకు హరితహారం నివేదికను సమర్పించి రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. సద్గురు సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.