Site icon HashtagU Telugu

HYD : ఫ్రీ కరెంట్ ‘0’ ఎక్కడ అంటూ గగ్గోలు పెడుతున్న నగరవాసులు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

గృహజ్యోతి పథకం (Gruha Jyothi Scheme)లో భాగంగా ముందుగా హైదరాబాద్ (Hyderabad)​లో 11 లక్షల మంది వినియోగదారులకు ఫ్రీ కరెంట్ (Free Curent) అందజేస్తున్నామని , ప్రజా పాలనా దరఖాస్తు చేసుకున్న వారికీ తప్పని సరిగా ఫ్రీ కరెంట్ అని తెలిపింది. ఈ ప్రకటన తో నగరవాసులు ఎంతో సంతోష పడ్డారు. కానీ నిన్న నగరంలోని పలు ఏరియాల్లో అధికారులు మీటర్‌ రీడింగ్‌ తీసి జీరో బిల్లులకు బదులు మాములు బిల్లే వేశారు. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కొంతమందికి ‘0 ‘ బిల్లు ఇచ్చి..కొందరికి మాములు బిల్లు ఇవ్వడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబదించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనికి కారణం ఏంటి అనేది అధికారులే తెలుపాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఆదివారం హైదరాబాద్‌ అమీర్‌పేటలో గృహజ్యోతి పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Minister Ponnam Prabhakar) ప్రారంభించారు. మీటర్‌ రీడింగ్‌ తీసి జీరో బిల్లులను మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నామని , ఒక్కో ఇంటికి రూ.వెయ్యి విలువైన కరెంటును ఉచితంగా అందిస్తున్నామని పెకొన్నారు. విపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలని, అనవసరమైన విమర్శలొద్దని సూచించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్లతోపాటు మిగతా వాగ్దానాలు పూర్తిచేస్తామని తెలిపారు.

Read Also : Color Added Chili : ఆఖరికి మిర్చిని కూడా వదలకుండా కలర్ వేస్తున్నారు..