Site icon HashtagU Telugu

Hyderabad: పోలింగ్ రోజు హైదరాబాద్ లో సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్

Hyderabad

Hyderabad

Hyderabad: రేపు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అంతకుముందు తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రచార కార్యక్రమాలు నిలిపివేశారు. నేతలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో పోల్ మేనేజ్మెంట్ పై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో నగరంలో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఎన్నికలను స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య చెప్పారు.

హైదరాబాద్ పోలీసులు సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సి) మరియు డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలతో పాటు, వాహన యజమానులు నంబర్ ప్లేట్‌లను సరిగ్గా లేకపోతే కూడా సీజ్ చేయనున్నట్టు తెలిపారు.హైదరాబాద్‌లో పోలింగ్‌ సందర్భంగా ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు సహకరించాలని స్థానికులు, రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమపై చర్యలు తీసుకోకుండా ఎక్కడైనా అక్రమాలను గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కాగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు.

Also Read: Deeksha Diwas 2023: కేటీఆర్ రక్తదానం, ఎన్నికల ఉల్లంఘన?