Site icon HashtagU Telugu

Hyderabad: చంద్రబాబు మద్దతుదారులకు హైదరాబాద్ డీసీపీ వార్నింగ్

Hyderabad

Logo (2)

Hyderabad: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నగరంలో పలు చోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. నిన్న గురువారం హైదరాబాద్ ఐటి కారిడార్ లో ఐటీ ఉద్యోగులు సైతం రోడ్లమీదకు వచ్చి చంద్రబాబు అరెస్టుని తప్పుబట్టారు. ఈ క్రమంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో హైదరాబాద్ పోలీసులు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు. శుక్ర, శనివారాల్లో మాదాపూర్‌ పరిసర ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులతో కలిసి టీడీపీ నిర్వహించ తలపెట్టిన నిరసనకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మాదాపూర్‌ డిప్యూటీ కమిషనర్‌ సందీప్‌ తెలిపారు. ఏదైనా ఉల్లంఘనలు జరిగితే, ఎవరైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నిరసనల గురించి సందేశాలను ప్రసారం చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డిసిపి హెచ్చరించారు.

శుక్రవారం సాయంత్రం ఐటీ ఉద్యోగులతో కలిసి మణికొండ మర్రిచెట్టు జంక్షన్‌లో టీడీపీ నేతలు గంటపాటు నిరసనకు సిద్ధమయ్యారు. శనివారం ఔటర్‌ రింగ్‌ రోడ్డు లో టెక్కీలతో కలిసి కార్‌ ర్యాలీకి ప్లాన్‌ చేశారు. నానక్‌రామ్‌గూడ టోల్‌గేట్‌ ప్రవేశం నుంచి కారు ర్యాలీని ప్లాన్‌ చేశారు. ఇది 60 కి.మీ వేగంతో రింగ్ రోడ్డులో వెళుతుంది. మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్ల ర్యాలీని ప్లాన్ చేశారు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఐఐఐటీ జంక్షన్‌లో శనివారం సాయంత్రం మరో నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆ పార్టీ ప్లాన్‌ చేసింది. బుధ, గురువారాల్లో ఐటీ హబ్‌లైన గచ్చిబౌలి, మాదాపూర్‌లలో కొందరు టీడీపీ మద్దతుదారులు, ఐటీ నిపుణులతో కలిసి నిరసనలు చేపట్టారు. బుధవారం విప్రో సర్కిల్‌లో ‘నేను సిబిఎన్‌తో ఉన్నాను’ అనే ప్లకార్డులను పట్టుకుని భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాగా గురువారం మాదాపూర్‌లోని సైబర్‌ టవర్‌ వద్ద సైబరాబాద్‌ పోలీసులు నిరసనను భగ్నం చేశారు. రద్దీగా ఉండే ప్రాంతంలో లంచ్-అవర్ నిరసన కోసం గుమిగూడిన చాలా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోట్లాది రూపాయల స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి చంద్రబాబును గత వారం అరెస్టు చేసింది. విజయవాడ కోర్టు అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. పద్నాలుగేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయుడు ఐటి రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఈ మేరకు అయన అరెస్టుకు నిరసనగా నగరంలోని పలు ఐటి కంపెనీలు నిరసనలు తెలుపుతూ ఆయనకు మద్దతు ఇస్తున్నారు.

Also Read: Tet-Exam : తెలంగాణ టెట్ పరీక్ష కేంద్రంలో విషాదం..నిండు గర్భిణీ మృతి

Exit mobile version