Site icon HashtagU Telugu

Telangana Drugs : తెలంగాణ ‘డ్ర‌గ్స్’ సినిమా!

CBN Jail Effect in Telangana

Revanth Ktr Drugs Case

డ్ర‌గ్స్ కేసును పీసీసీ చీఫ్ రేవంత్ మ‌లుపు తిప్పుతున్నాడు. ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ఆ కేసు వెంట‌ప‌డ్డాడు. సీబీఐ విచార‌ణ చేయాల‌ని హైకోర్టులో వేసిన ఫిటిష‌న్ కు ఈడీ కూడా ఇప్లీడ్ అయింది. దీంతో సినీ పెద్ద‌లు, తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఒక యువ‌నేత , ర‌కుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్ల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రానుంది. తొలి నుంచి రేవంత్ చెబుతున్న దాని ప్ర‌కారం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డ్రగ్ పెడ్లర్ కెల్విన్ చుట్టూ ర‌హ‌స్యాలు అల్లుకుని ఉన్నాయి. ఆ మేర‌కు ఈడీ విచార‌ణ కొన‌సాగించాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నాడు.డ్ర‌గ్స్ కేసును విచారించి క్లీన్ చిట్ ఇచ్చిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారుల‌ను తాజాగా ఈడీ విచారించ‌డానికి సిద్ధం అయింది. ఆ మేర‌కు కొంద‌రు ఎక్సైజ్ అధికారులకు నోటీసులు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. డ‌గ్స్ కేసును విచారించిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు త‌యారు చేసిన డిజిట‌ల్ రికార్డులు, భౌతిక, ఎఫ్ ఐ ఆర్‌, చార్జిషీట్ లు ఇప్ప‌టి వ‌ర‌కు గోప్యంగా ఉన్నాయి. వాటిని ఇవ్వ‌డానికి ఆ శాఖ అధికారులు ఈడీకి స‌హకారం అందించ‌లేదు. దీంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. డ్ర‌గ్స్ విచార‌ణ‌కు సంబంధించిన అన్ని రికార్డ్స్ ఈడీకి అంద‌చేయాల‌ని హైకోర్టు చెప్పిన‌ప్ప‌టికీ ఎక్సైజ్ శాఖ ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి స్థాయిలో ముందుకు రాలేదు. దీంతో వాళ్ల‌ను విచారించ‌డానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) సిద్ధం అయింది.

తాజాగా టోనీ వ్య‌వ‌హారం మీద ఎక్కువ‌గా ఈడీ దృష్టి పెట్టింది. ఆయ‌న ద్వారా నైజీరియాకు పెద్ద మొత్తంలో నిధులు త‌ర‌లి వెళ్లాయ‌ని అనుమానిస్తోంది. మ‌నీ లాండ‌రింగ్ కు సంబంధించిన ఆన‌వాళ్ల‌ను టోనీ ఉప‌యోగించిన ల్యాప్ టాప్, మొబైల్ నుంచి సేక‌రించిన‌ట్టు స‌మాచారం. వాటి ఆధారంగా టాలీవుడ్ లోని కొంద‌రు స్టార్ హీరోలు, హీరోయిన్లు, న‌టుల‌ను మ‌రోసారి విచార‌ణ‌కు పిలిచే అవ‌కాశం ఉంది. ప్ర‌ముఖ వ్యాపార‌, పారిశ్రామిక వేత్త‌ల‌ను కూడా విచార‌ణ జ‌ర‌ప‌డానికి ఈడీ సిద్ధం అయింద‌ని వినికిడి. హవాలా మార్గంలో నిధులను భారీ ఎత్తున పారిశ్రామిక‌, వ్యాపార వ‌ర్గాలు కొంద‌రు తెలంగాణ నుంచి త‌ర‌లించిన‌ట్టు ఈడీ బ‌లంగా అనుమానిస్తోంది.మరోవైపు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేసి వాళ్ల నుంచి డబ్బులను నైజిరీయాకు తరలించినట్టుగా హైదరాబాద్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ క్రమంలోనే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసును విచారించాలని ఈడీ భావిస్తోంది. హవాలా రూపంలో డ్రగ్స్ కొనుగోళ్లు జరిగాయా? అనే కోణం నుంచి ఈడీ ఆలోచిస్తోంది. ఈసారి ఈడీ దూకుడుగా విచార‌ణ చేస్తోంది. తెలంగాణ పోలీసులు ఇస్తోన్న స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకుంటూ ప‌లు కోణాల నుంచి డ్ర‌గ్స్ కేసును విచార‌ణ చేస్తోంది. తాజా ఎక్సైజ్ అధికారుల‌ను కూడా విచారించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఒక్కసారిగా డ్ర‌గ్స్ కేసు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశమైంది.

తెలుగు సినీ ప్ర‌ముఖులు, హీరోలు, న‌టులు కొంద‌రు డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు 2017లో సుదీర్ఘంగా విచార‌ణ చేశారు. ఏడాదిన్న‌ర పాటు విడ‌త‌వారీగా ప‌లువుర్ని విచార‌ణ చేసిన విష‌యం విదిత‌మే. అంతిమంగా గ‌త ఏడాది ఏప్రిల్ లో తెలంగాణ‌లో డ్ర‌గ్స్ వాడ‌కం జ‌ర‌గ‌లేద‌ని క్లీన్‌చిట్ ఇవ్వ‌డం జ‌రిగింది. ఇటీవ‌ల బెంగుళూరు, ముంబ్బైయ్ కేంద్రంగా జ‌రిగిన డగ్స్ విచార‌ణ‌లో మ‌రోసారి హైద్రాబాద్ మూలాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. హీరో సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య త‌రువాత ముంబ్బై డ్ర‌గ్స్ కేసు పై విచార‌ణ చాలా సీరియ‌స్ అయింది. అక్క‌డ జ‌రిగిన విచార‌ణ‌కు హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ను పిలిచారు. విచార‌ణ క్ర‌మంలో హైద్రాబాద్ కు చెందిన ప‌లువురి ప్ర‌ముఖుల‌ పేర్ల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్టు ఆనాడు సోష‌ల్ మీడియాలో న్యూస్ హ‌ల్ చ‌ల్ చేసింది. అంతేకాదు, బెంగుళూరు కేంద్రంగా జ‌రిగిన డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌లోనూ హైద్రాబాద్ మూలాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ రోజున తెలంగాణ‌కు చెందిన అధికారి పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం ఉంద‌ని న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అలాంటి ప్ర‌చారాల‌కు తెర‌దించుతూ తెలంగాణ‌లో డ్ర‌గ్స్ క‌ద‌లిక‌లు లేవ‌ని ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా మ‌ళ్లీ డ‌గ్స్ కేసులో టోనీ ప్ర‌మేయం బ‌య‌ట‌డ‌డంతో మొత్తం వ్య‌వ‌హారం ఈడీ ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తోంది. రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న‌ట్టు డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ను విచారిస్తే హ‌వాలా వ్య‌వ‌హారంలోని పెద్ద‌ల వ్య‌వ‌హారం బ‌హిర్గ‌తం అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు. సో..రేవంత్ రెడ్డి న్యాయ‌పోరాటం టోనీ రూపంలో కొంత ఫ‌లించిన‌ప్ప‌టికీ కెల్విన్ విష‌యంలో మాత్రం ఇంకా ఉంది. డ్ర‌గ్ల‌ర్ కెల్విన్ ను ఈడీ విచారిస్తే రేవంత్ పోరాటం చాలా వ‌ర‌కు ఫ‌లించిన‌ట్టే.!