Site icon HashtagU Telugu

Hyderabad : నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఈ ప్రాంతాల్లో వెళ్లే వారు..!

Trafic

Trafic

మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం హైద‌రాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్‌ రహితంగా ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్, డబీర్ పురా ఫ్లై ఓవర్, లంగర్‌హౌజ్ ఫై ఓవర్, పీవీఎస్‌ఆర్ ఎక్స్‌ ప్రెస్ వే, లాలాపేట ఫ్లై ఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్లు నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయనున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిప‌రు. ఈ ఊరేగింపు సయ్యద్ కాద్రీ చమన్ నుంచి ప్రారంభమై గులాం ముర్తుజా కాలనీ, ఫలక్‌నుమా నుంచి ప్రారంభమై ఫలక్‌నూమా ఎక్స్ రోడ్, అలియాబాద్ ఎక్స్ రోడ్, లాలు దర్వాజా, చార్మినా, గుల్జార్ హౌజ్, మదీనా, నయాపూల్ బ్రిడ్జి, సాలార్‌జంగ్ మ్యూజియం, పురానీ హవేలీ, ఎతేబార్ చౌక్ నుంచి బీబీ బజార్‌లోని వోల్టా హోటల్ వద్ద ఉరేగింపు ముగుస్తుంది. ఈ ప్రాంతాల్లో వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ను గమనించాలని పోలీసులు కోరారు.