Site icon HashtagU Telugu

హైదరాబాద్ లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లపై పోలీస్ ఆంక్షలు

Restrictions In Hyderabad F

Restrictions In Hyderabad F

మరో 10 రోజుల్లో కొత్త ఏడాది (New Year)లోకి అడుగుపెట్టబోతున్నాం..ఈ సందర్బంగా యావత్ ప్రజలంతా 2023 కు బై..బై చెపుతూ.. కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. పబ్స్ , హోటల్స్ , బార్స్ ఇలా అన్ని కూడా వేడుకలతో హోరెత్తిస్తుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు సైతం ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు హైదరాబాద్ కు వస్తుంటారు.

ఈ క్రమంలో నగరపోలీసులు (Hyderabad Police Enforce Strict Guidelines ) న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి ఒకటి గంటలలోపు కొత్త సంవత్సర వేడుకలు ముగించాలని పోలీసులు సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు పది రోజుల ముందుగానే వేడుకలకు అనుమతులు తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ధం రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో డ్ర‌గ్స్, గంజాయి వాడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అనుమ‌తి లేకుండా లిక్క‌ర్ స‌ర‌ఫ‌రా చేయ‌కూడ‌ద‌న్నారు. మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌పరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబ‌డితే రూ. 10 వేలు జ‌రిమానా, ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. సాధార‌ణ పౌరుల‌కు ట్రాఫిక్ స‌మ‌స్య సృష్టించొద్ద‌ని సూచించారు. లిక్క‌ర్ ఈవెంట్స్‌లో మైన‌ర్ల‌కు అనుమ‌తి లేదు. ఒక వేళ అనుమ‌తిస్తే నిర్వాహ‌కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చ‌రించారు. వేడుకలకు అనుమతించిన సమయం ముగిశాక లిక్కర్ సరఫరా చేస్తే చర్యలు తప్పవన్నారు.

Read Also : IPL 2024 Auction: ఐపీఎల్ వేలంలో ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరు ?