Site icon HashtagU Telugu

Drugs : హైద‌రాబాద్‌లో అంత‌రాష్ట్ర డ్ర‌గ్స్ వ్యాపారి అరెస్ట్‌.. గంజాయి చాక్లెట్స్ స్వాధీనం

Ganja Imresizer

Ganja Imresizer

హైదరాబాద్‌లో అంతర్ రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారి వ‌ద్ద గంజాయితో కూడిన చాక్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తిని మహ్మద్ జాఫర్ ఉర్ హక్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు బీహార్‌లోని పుప్రి టౌన్, సీతామర్హి నుండి గంజాయి ఉన్న చాక్లెట్‌లను తీసుకువచ్చి బీహారీలకు, తెలిసిన వ్యక్తులకు విక్రయించడం ప్రారంభించాడని డీసీపీ రాధా కిషన్ తెలిపారు. అతని చాక్లెట్ గంజాయి వ్యాపారం హైదరాబాద్‌లోని మహదీపట్నంలో స్థానిక ప్రజలకు ఒక్కొక్కరికి రూ. 20-50కి విక్రయించి సులభంగా డబ్బు సంపాదిస్తున్నాడ‌ని తెలిపారు. నిందితుడు ప్రతి రెండు నెలలకోసారి బీహార్ రాష్ట్రానికి వెళ్లి గంజాయి చాక్లెట్లను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్ నగరంలో విక్రయించేవాడని తెలిపారు. సాయంత్రం వేళల్లో మొహమ్మద్ జాఫర్ ఉర్ హక్ హైదరాబాద్‌లోని జీబా బాగ్, ఆసిఫ్ నగర్ సమీపంలో నిరుపేద వినియోగదారులకు గంజాయి చాక్లెట్‌లను విక్రయించడానికి ప్రయత్నించాడ‌ని.. అదే సమయంలో కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ బృందం అతన్ని గంజాయి చాక్లెట్‌లతో రెడ్ హ్యండెడ్‌గా ప‌ట్టుకున్నార‌ని తెలిపారు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని ఎస్‌హెచ్‌ఓ, ఆసిఫ్ నగర్ పీఎస్‌కు అప్పగించామ‌ని డీసీపీ రాధా కిష‌న్ తెలిపారు.

Exit mobile version