Site icon HashtagU Telugu

Metro Train : ఇటు మహేశ్వరం వరకు.. అటు BHEL వరకు మెట్రో ట్రైన్ పొడిగింపు.. సీఎం కేసీఆర్

Hyderabad Metro train extended to Maheshwaram and BHEL said by CM KCR

Hyderabad Metro train extended to Maheshwaram and BHEL said by CM KCR

హైదరాబాద్(Hyderabad) లో మెట్రో ట్రైన్(Metro Train) ఇప్పుడు ఎంతోమందికి అనుకూలంగా మారింది. ముఖ్యంగా ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి, హైదరాబాద్ ట్రాఫిక్(Traffic) సమస్యల నుంచి తప్పించుకోవడానికి మెట్రో రైళ్లు ఉపయోగపడుతున్నాయి. ఇటీవల మెట్రోలో కూడా రద్దీ ఎక్కువైంది. ఇక మెట్రో రైలుని పలు మార్గాల్లో పొడగించడానికి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాయ్‌దుర్గ్(Rai Durg) నుండి ఎయిర్పోర్ట్(Airport) వరకు మెట్రోకు శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా మెట్రో మరింత దూరం పొడగింపుపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్ములూరులో జరిగిన హరితోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తుమ్మలూరు ఫారెస్ట్ లో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన కేసీర్ కీలక ప్రకటన చేశారు.

సీఎం కేసీఆర్ ఈ సభలో మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టు అనుకున్నప్పుడే ఎయిర్పోర్ట్ వరకు కట్టాల్సింది. కానీ అప్పటి పాలకులు ఆలోచించలేదు. ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలుని పొడిగిస్తున్నాము. ఇందుకు ఆరువేల కోట్లను ఖర్చు పెడుతున్నాము. త్వరలో ఆ ప్రాజెక్టు ఎయిర్పోర్ట్ నుంచి మహేశ్వరం, కందుకూరు వరకు పొడిగించేందుకు కృషి చేస్తాం. అలాగే LB నగర్ – మియాపూర్ వరకు ఉన్న మెట్రో రైలుని BHEL వరకు పొడిగించనున్నాం అని తెలిపారు. సీఎం కేసీర్ మెట్రో ప్రకటనతో హైదరాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మెట్రో పనులు ఎప్పుడు మొదలవుతాయి చూడాలి.

 

Also Read :  Telangana BJP : డీలాప‌డ్డ తెలంగాణ బీజేపీ.. మూడో స్ధానానికే ప‌రిమిత‌మా..?