Hyderabad Metro : అమెరికా యూనివర్సిటీలో హైదరాబాద్ మెట్రో సక్సెస్ స్టోరీ

Hyderabad Metro : మన హైదరాబాద్ మెట్రో సక్సెస్ స్టోరీ అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్‌ స్టడీగా మారింది.

Published By: HashtagU Telugu Desk
Hyderabad Metro

Cag Report On Hyderabad Metro Rai

Hyderabad Metro : మన హైదరాబాద్ మెట్రో సక్సెస్ స్టోరీ అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్‌ స్టడీగా మారింది. స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రచురించే సోషల్‌ ఇన్నోవేషన్‌ రివ్యూ (SSIR) లేటెస్ట్ త్రైమాసిక జర్నల్‌లో దీనికి సంబంధించిన వివరాలను పబ్లిష్ చేశారు. ఇది భారత మౌలిక వసతుల ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవంగా ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) వెల్లడించింది. ప్రపంచంలో చేపట్టిన భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ జర్నల్‌ ప్రచురిస్తుంటుంది.

We’re now on WhatsApp. Click to Join

అనేక రీసెర్చ్ ప్రాజెక్టుల గట్టిపోటీ నడుమ ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్ రామ్‌ నిడుమోలు, ఆయన టీమ్ హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టుపై క్షుణ్నంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం కేస్‌ స్టడీగా ఎంచుకొని పబ్లిష్ చేసింది. పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్) విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోరైలు(Hyderabad Metro) ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయడంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబర్చిందని ఈ రీసెర్చ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడులతో ప్రజాప్రయోజన ప్రాజెక్టుల నిర్మాణం ఏవిధంగా సాధ్యమనేది దీని ద్వారా తెలుస్తుందని జర్నల్ పేర్కొంది. హైదరాబాద్ మెట్రోకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.హైదరాబాద్ మెట్రో నిత్యం దాదాపు 5 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. విద్యార్థులు, ఉద్యోగాలు చేసేవారు. రోజువారీ కార్మికులు నగరం ఓ చివర నుంచి మరో చివరకు వేగంగా చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు.

Also Read :CM Revanth: ఇవాళ రేవంత్‌రెడ్డి భద్రాచలం పర్యటన.. ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభం

  • కోల్‌కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.
  • కోల్‌కతాలో భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో విభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించారు.
  • ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు దేశం పురోగతిని ప్రదర్శించే మైలురాయి ప్రాజెక్ట్‌గా భావించవచ్చు.
  • అండర్ వాటర్ సర్వీస్ కోల్‌కతా మెట్రో తూర్పు-పశ్చిమ కారిడార్‌లోని హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగంలో భాగం.
  • ఇది హుగ్లీ నది కింద 16.6 కి.మీ ఉంది.
  • హుగ్లీ నది కింద కోల్‌కతా ఈస్ట్, వెస్ట్ మెట్రో కారిడార్ నుంచి దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ అండర్ రివర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు.
  • హౌరా మెట్రో స్టేషన్‌లో దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌ కలిగి ఉంటుంది.
  Last Updated: 11 Mar 2024, 08:17 AM IST