Site icon HashtagU Telugu

Hyderabad Metro: కరోనా వ్యాప్తికి ‘మెట్రో’ చెక్.. దేశంలో మొదటిసారిగా!

Metro

Metro

L&T మెట్రో రైల్ (హైదరాబాద్) కోచ్‌లలో ‘ఓజోన్ ఆధారిత శానిటైజేషన్‌’ను ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి మెట్రో రైలుగా అవతరించింది. కోవిడ్-19 మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాల కోసం కోచ్‌లను శుభ్రపరచడానికి మూడు పోర్టబుల్ ఓజికేర్ మొబిజోన్ యూనిట్‌లను ప్రవేశపెట్టింది. ఓజోన్ ద్వారా గాలి, ఉపరితలాన్ని శుభ్రపరచడం అనేది ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాలు, నీటిని క్రిమిసంహారక చేయడం లాంటివాటికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ మొదటిసారి అందుకు భిన్నంగా మెట్రోలో ఈ యూనిట్స్ ప్రారంభంకాబోతున్నాయి.

హైదరాబాద్ మెట్రో రైల్ గత కొన్ని నెలలుగా వివిధ మెట్రో కోచ్‌లలో Ozycare Mobizone పరీక్షలను నిర్వహించింది. తర్వాత NABL గుర్తింపు పొందిన ల్యాబ్ ద్వారా శానిటైజేషన్ సామర్థ్యాన్ని పరీక్షించింది. కోచ్‌ల గాలి, ఉపరితలం నుండి వ్యాధికారక శాతాన్ని అరికడుతుంది. దాని ప్రభావం ఆధారంగా హైదరాబాద్ మెట్రో రైలు ఇప్పుడు ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కోచ్‌ల్లో శానిటైజ్ చేయడానికి పరికరాలను ఉపయోగిస్తోందని మెట్రో నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా MD & CEO KVB రెడ్డి మాట్లాడుతూ “ఇది వ్యూహాత్మక నిర్ణయం. ఇది ప్రయాణికుల ప్రయాణాన్ని సురక్షితంగా చేయడానికి మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’’ saఅని అన్నారు.