Site icon HashtagU Telugu

Hyderabad Metro: విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన హైద‌రాబాద్ మెట్రో.. ఇందుకోసం కొత్త స్మార్ట్ కార్డు

Hyderabad Metro Student Pass

Hyderabad Metro Student Pass

హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. జూలై1వ తేదీ నుంచి మెట్రోరైలులో విద్యార్థుల‌కు పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పే లెస్‌, ట్రావెల్ మోర్ (Pay Less, Travel More) పేరుతో ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించింది. 20 ట్రిప్పుల‌కు మెట్రో చార్జీ చెల్లించి 30 ట్రిప్పుల ప్ర‌యాణం చేయొచ్చ‌ని మెట్రో పేర్కొంది. ఇందుకోసం విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా కొత్త‌గా బ్రాండ్ చేయ‌బ‌డిన స్మార్ట్ కార్డ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ట్రిప్ పాస్ చెల్లుబాటు పాస్ కొనుగోలు తేదీ నుండి 30రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ 1 జూలై 2023 నుండి 31 మార్చి 2024 వరకు తొమ్మిది నెలల పాటు అందుబాటులో ఉంటుంద‌ని హైద‌రాబాద్ మెట్రో యాజ‌మాన్యం స్ప‌ష్టం చేసింది.

ఒక్కో విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయబడుతుంది. అయితే, అంద‌రు విద్యార్థుల‌కు ఈ పాస్ ఆఫ‌ర్ అందుబాటులో ఉండ‌దు. 1 ఏప్రిల్ 1998 తర్వాత జన్మించిన విద్యార్థులు మాత్ర‌మే ఈ పాస్ పొందేందుకు అర్హులు. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు అందుబాటులో ఉంటుంద‌ని హైద‌రాబాద్ మెట్రో తెలిపింది. సంస్థ నిర్ణయం ప్రకారం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.

ఈ పాస్‌ల‌ను విద్యార్థులు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు JNTU కళాశాల, SR నగర్, అమీర్పేట్, విక్టోరియా మెమోరియల్, దిల్‌ఖుష్ న‌గ‌ర్‌. నారాయణగూడ. అదేవిధంగా నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, రాయదుర్గ్ స్టేష‌న్ల‌ వద్ద కొనుగోలు చేయొచ్చు. ఈ పాస్ పొందాలంటే క‌ళాశాల‌, పాఠ‌శాల ఐడీ కార్డును త‌ప్ప‌నిస‌రిగా చూపించాల్సి ఉంటుంది.

Tomato Grand Challenge: టమాటా ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. రేట్స్ తగ్గించే సలహాలు ఇవ్వండి అంటూ ప్రకటన..!