Rains Forecast : ఎండలతో అల్లాడుతున్న తెలంగాణవాసులకు శుభవార్త. ఎందుకంటే వచ్చే మూడురోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గంటకు దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గురువారం కూడా పలు జిల్లాల్లో వానలు(Rains Forecast) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
- బుధవారం రోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వానలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ విభాగం పేర్కొంది.
- గురువారం రోజు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్‌లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో వానలు పడుతాయని పేర్కొంది.
Also Read : KTR : కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం : కేటీఆర్
- శుక్రవారం రోజు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడొచ్చు.
- శనివారం రోజు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.