Hyderabad: సీఎం రేవంత్ తో భేటీ అయిన హైదరాబాద్ మేయర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.

Published By: HashtagU Telugu Desk
Hyderabad

Hyderabad

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి జీహెచ్ ఎంసీ (GHMC) జనరల్ బాడీ కౌన్సిల్‌ సమావేశమవుతుంది. మేయర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లు తమ సమస్యలను లేవనెత్తుతారు. అయితే చివరి జనరల్ బాడీ సమావేశం ఆగస్టులో నిర్వహించగా, నవంబర్‌లో నిర్వహించాల్సి ఉంది. ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున కౌన్సిల్‌ సమావేశం జరగలేదు.

శుక్రవారం బీఆర్‌ఎస్‌కు చెందిన ఒకరితో పాటు బీజేపీ కార్పొరేటర్లు సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాప్యానికి బీజేపీ కార్పొరేటర్లు శ్రావణ్ వూరపల్లి, ఆకుల శ్రీవాణిలు కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు శనివారం సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు.

Also Read: TTD: హిందూ ధర్మప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీటీడీ చైర్మన్ భూమన

  Last Updated: 03 Feb 2024, 03:17 PM IST