Inspirational Story : ఎస్ఐ ఉద్యోగం పోగొట్టుకున్న మూడు సంవత్సరాల్లో ఐపీఎస్ అయ్యాడు

మూడేళ్ళ కింద ఎస్ఐ జాబ్ కి క్వాలిఫై కానీ ఒక వ్యక్తి ఏకంగా ఐపీఎస్ ట్రయినింగ్ పూర్తి చేసుకున్నారు.

మూడేళ్ళ కింద ఎస్ఐ జాబ్ కి క్వాలిఫై కానీ ఒక వ్యక్తి ఏకంగా ఐపీఎస్ ట్రయినింగ్ పూర్తి చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సిరిశెట్టి శ్రీకాంత్ మూడేళ్ళ క్రితం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ పోస్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. దానిలో భాగంగా రాత పరీక్షలో కూడా క్వాలిఫై అయ్యాడు. కానీ 800 మీటర్ల పరుగుపందెంలో శ్రీకాంత్ క్వాలిఫై అవ్వలేక జాబ్ సాధించలేకపోయాడు.

ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేసిన శ్రీకాంత్ మిషన్ భగీరథ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు. ఆఫీసుకి ఉదయం 7 గంటలకే వెళ్లినా సాయంత్రం వరకు పెద్దగా పని ఏమీ ఉండకపోయేదట. ఆ సమయాన్ని శ్రీకాంత్ యూపీఎస్సి కి ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగించుకున్నాడట. 800 మీటర్లు సకాలంలో పరిగెత్తకుండా పోలీసు ఉద్యోగం చేజారిన శ్రీకాంత్ తన ఐదవ అటెంప్ట్ లో ఐపీఎస్ కి సెలక్టయి ట్రయినింగ్ పూర్తి చేసుకున్నారు.

తనని ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలన్నది తన తండ్రి కోరిక అని, తండ్రి కోరిక తీర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని శ్రీకాంత్ తెలిపారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, కేవలం 800 మీటర్లు పరిగెత్తడానికి సహకరించని తన ఫిట్నెస్ ని ఐపీఎస్ ఆఫీసర్ గా ఫిజికల్ టెస్టులో పలు మెడల్స్ సాధించేలా తీర్చి దిద్దుకున్నానని శ్రీకాంత్ తెలిపారు. తనని తెలంగాణ క్యాడర్ కు కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీకాంత్ అన్నారు.

Also Read : విప్ల‌వం నీడ‌న `గోండుల‌` వ్య‌ధ‌