Hyderabad: దంతవైద్యం కోసం వెళ్లిన ఓ యువకుడు మృతి

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు మృతి చెందాడు

Hyderabad: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పంటి నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు ఆస్పత్రికి వెళితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడని తండ్రి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. .

వింజం లక్ష్మీ నారాయణ (28) కొంతకాలంగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37లోని అపోలో ఆస్పత్రికి వెళ్ళాడు. ఆ యువకుడి పంటిని పరీక్షించి స్కాన్ తీశారు. ఆ తర్వాత పంటిని తొలగించాలని చెప్పారు. దాంతో లక్ష్మి నారాయణ పంటి తొలగింపుకు సరేనన్నాడు. అయితే పన్ను పీకేసే సమయంలో నొప్పి రాకుండా ఉండటానికి మత్తు ఇచ్చారు. అయితే చికిత్స పొందిన కొద్ది గంటల్లోనే లక్ష్మీనారాయణ మృతి చెందాడు.

ఆయన మృతి పట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపించారు. మత్తు మోతాదు ఎక్కువైందని, దాని ప్రభావంతో కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన కుమారుడి ప్రాణం తీసిన ఆసుపత్రి, వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

Also Read: Free Power: గృహజ్యోతి వినియోగదారులకు గుడ్ న్యూస్, మార్చి 1 నుంచి ఉచిత విద్యుత్