Site icon HashtagU Telugu

MLC Election: హైదరాబాద్‌ ‘లోకల్’ ఎమ్మెల్సీ.. గెలుపు ఆ పార్టీదే

Hyderabad Local Bodies Mlc Election Mim Congress Brs Bjp

MLC Election: తెలంగాణలో  మరో ఎమ్మెల్సీ స్థానం భర్తీ కాబోతోంది. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్‌ 4న నామినేషన్లను స్వీకరించనున్నారు.  ఏప్రిల్‌ 7న నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 9 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఈ స్థానం ఎవరికి దక్కబోతోంది ? ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్న రాజకీయ పార్టీలు ఏవి ? అనేది చూద్దాం..

Also Read :Earthquake : భద్రాచలం లో భూకంపం వచ్చే ఛాన్స్..?

మొత్తం 110 ఓట్లు

ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనుంది. దీంతో ఆ స్థానాన్ని(MLC Election) భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో బలంగా ఉన్న పార్టీకే  ఈ సీటు దక్కుతుంది. ఈ సీటు పరిధిలో మొత్తం 110 ఓట్లు ఉన్నాయి. వాటిలో 81 ఓట్లు కార్పొరేటర్లవే. 29 మంది ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఉన్న 3 డివిజన్లకు కార్పొరేటర్ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కలను బట్టి ఒక విషయం క్లియర్ అవుతోంది. అత్యధిక సంఖ్యలో కార్పొరేటర్లను కలిగిన పార్టీకే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు కైవసం అవుతుంది.

Also Read :Dasaradha Rama Reddy : పురస్కారం అందుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీ తేతలి దశరథరామా రెడ్డి

హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ స్థానంలో బలాబలాలు 

విజయం ఎవరికి ? 

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో అత్యధికంగా 49 ఓట్లు మజ్లిస్ పార్టీకే ఉన్నాయి.  ఈ పార్టీకి పరోక్షంగా కాంగ్రెస్ మద్దతు కూడా ఉంది. దీంతో ఈ స్థానంలో మజ్లిస్ పార్టీ ప్రతిపాదించే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ. బీఆర్ఎస్ ,కాంగ్రెస్‌లు మజ్లిస్‌తో లోపాయికారి ఒప్పందం  చేసుకొని, తమ పార్టీల అభ్యర్థులను బరిలోకి దింపడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 25న ఫలితాలు వస్తాయి.

Exit mobile version