Site icon HashtagU Telugu

Hyderabad : గ‌ర్భిణిల‌పై లాఫింగ్ గ్యాస్ ట్ర‌య‌ల్స్

Hospital

Hospital

ప్ర‌స‌వ‌వేద‌న నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి గ‌ర్భిణుల‌కు కింగ్ కోటి. ఆస్ప‌త్రి లాఫింగ్ గ్యాస్ ను ఇస్తోంది. నొప్పుల నుంచి త‌ట్టుకుని ప్ర‌స‌వించ‌డానికి ఆ గ్యాస్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వైద్యులు తేల్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 13 మంది గ‌ర్భిణుల‌కు లాఫింగ్ గ్యాస్ ప్ర‌యోగించ‌డం ద్వారా ప్ర‌స‌వాల‌ను విజ‌య‌వంతంగా చేసిన‌ట్టు కింగ్ కోటి జిల్లా ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగం డాక్టర్ జలజ వెరోనికా వెల్ల‌డించారు.

ప్రసవ సమయంలో స్త్రీల నొప్పి మరియు బాధలను తగ్గించడానికి కింగ్ కోటి జిల్లా ఆసుపత్రి ఎంటోనాక్స్ (నైట్రస్ ఆక్సైడ్ మరియు ఆక్సిజన్ మిశ్రమం అయిన గ్యాస్) ఉపయోగించడం ప్రారంభించింది. తీవ్ర ప్రసవ నొప్పులతో బాధపడే గర్భిణులకు కాస్త ఉపశమనం కలుగుతుందట‌. ప్రసవానికి గురవుతున్న మహిళలు ఈ ఆక్సిజన్ , లాఫింగ్ గ్యాస్ మిశ్రమాన్ని పీల్చడం ద్వారా వారి నొప్పిని తగ్గించుకోవచ్చని వైద్యులు తేల్చారు.

గ‌ర్భిణి నొప్పి థ్రెషోల్డ్‌పై ఆధారపడి, వాయువులు 15-20 సెకన్లలో ఇంద్రియ నరాల మీద పని చేయడం ప్రారంభిస్తాయి. ఒకటి నుండి రెండు నిమిషాల వరకు నొప్పి ఉపశమనం అందిస్తాయి. మత్తుమందుగా పనిచేయడానికి బదులుగా, అవి అనాల్జేసిక్‌గా పనిచేస్తాయ‌ని డాక్ట‌ర్ వేరొనికా చెబుతున్నారు.
“ప్రసవ సమయంలో స్త్రీలు నొప్పిని భరించలేనప్పుడు ఎంటానాక్స్ సిలిండర్‌కు కనెక్ట్ చేయబడిన ఆక్సిజన్ మాస్క్‌ను గ‌ర్భిణికి అందిస్తున్నారు. రోగి లోతుగా ఊపిరి పీల్చుకున్నప్పుడు, గ్యాస్ ఆమె శరీరంలోకి వెళ్లి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.”మే 12న మొదటిసారిగా ఉపయోగించబడినప్పటి నుండి ఇప్పటి వరకు 13 మంది గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో ప్రసవ సమయంలో ఈ ఫార్ములాను ఉపయోగించార‌ని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వాసుపత్రిలో దీన్ని అమలు చేసేందుకు ఆరోగ్యశాఖ యోచిస్తోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.

Exit mobile version