Site icon HashtagU Telugu

Earth Hour 2024: శనివారం హైదరాబాద్ లో గంటపాటు ఎర్త్ అవర్

Earth Hour 2024

Earth Hour 2024

Earth Hour 2024: ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు సంవత్సరానికి ఒక రోజు ఎర్త్ అవర్ పాటిస్తారు. దీన్ని మొదట ఆస్ట్రేలియాలో మొదలు పెట్టారు. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఎర్త్ అవర్ కార్యక్రమం మొదలైంది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దీనిని నిర్వహిస్తున్నారు.ప్రజలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఇందులో భాగస్వాములవుతారు. ప్రస్తుతం ఇందులో 190 దేశాలు భాగస్వామ్యమయ్యాయి.

హైదరాబాద్ లో శనివారం గంటపాటు ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. విద్యుత్ వినియోగం, పర్యావరణ సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరంలోని కీలక ప్రాంతాల్లో ఎర్త్ అవర్ ని ప్రవేశపెట్టనున్నారు. ఇంతకీ ఈ ఎర్త్ అవర్ అంటే ఏంటంటే.. పర్యావరణ సమస్యలు మరియు రోజువారీ విద్యుత్ వినియోగం ప్రభావం గురించి అవగాహన లక్ష్యంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తారు. ఎర్త్‌ అవర్‌ను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. తద్వారా అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాల వాడకం గంటపాటు ఆగిపోతుంది.

రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ వంతెన, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఐకానిక్ స్మారక చిహ్నాల ప్రదేశాల్లో శనివారం రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు లైట్లను ఆపివేయనున్నారు.

Also Read: KCR National Politics: కేసీఆర్ జాతీయ స్థాయి ముచ్చట మర్చిపోవాల్సిందేనా?