Site icon HashtagU Telugu

Hyderabad: 826 కోట్లతో కేబీఆర్‌ పార్క్‌ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ గ్రీన్ సిగ్నల్

Hyderabad, Kbr Park Junctions

Hyderabad, Kbr Park Junctions

Hyderabad: కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) పార్క్ చుట్టూ ఉన్న ఆరు కీలక జంక్షన్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం మొత్తం రూ.826 కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.అంతకుముందు ఈ ఆరు జంక్షన్లకు సంబంధించి అభివృద్ధి నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. అయితే ఈ ప్రాజెక్టుని రెండు ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి ప్యాకేజీలో రూ.421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్‌ను అభివృద్ధి చేస్తారు. ఆ తర్వాత రెండో ప్యాకేజీలో రూ.405 కోట్లతో రోడ్‌ నెం.45 జంక్షన్, ఫిల్మ్ నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ అలాగే క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు.

వాస్తవానికి కేబీఆర్‌ పార్కు ప్రాంతంలో భారీ ట్రాఫిక్‌ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ , మాదాపూర్, హైటెక్ సిటీ మార్గంలో ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో గంటకు 25 వేలకు పైగానే వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సత్వర పరిష్కారం కోసం అన్వేషించింది. అదేవిధంగా అదనంగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) వర్షాకాలంలో అడ్డంకులను నివారించడానికి, సమర్థవంతమైన డ్రైనేజీని నిర్ధారించడానికి మరియు వరద ప్రమాదాలను తగ్గించడానికి అండర్‌పాస్‌ల క్రింద రెయిన్‌వాటర్ రిటెన్షన్ స్ట్రక్చర్‌లను ఏకీకృతం చేసింది.

ప్యాకేజీ-I (రూ. 421 కోట్లు)

రోడ్ నెం-45 నుండి కేబీఆర్ పార్క్ మరియు యూసుఫ్‌గూడకు వై షేప్ అండర్‌పాస్

• కేబీఆర్ పార్క్ ప్రవేశ జంక్షన్ నుండి రోడ్ నెం 36 వైపు 4 లేన్ ఫ్లైఓవర్

• యూసుఫ్‌గూడ వైపు నుండి రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ ఫ్లైఓవర్

• జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్

• పంజాగుట్ట వైపు నుండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు 3 లేన్

• కేబీఆర్ ప్రవేశ జంక్షన్ నుండి పంజాగుట్ట వైపు 3-లేన్ అండర్ పాస్

ప్యాకేజీ-II (రూ. 405 కోట్లు)

రోడ్ నెం 45 జంక్షన్:

• ఫిలింనగర్ జంక్షన్ నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు 2 లేన్ అండర్ పాస్

• జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుండి రోడ్ నెం 45 వైపు 2 లేన్ ఫ్లైఓవర్

ఫిలింనగర్ జంక్షన్:

• మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుండి రోడ్ నెం 45 జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్

• ఫిల్మ్ నగర్ జంక్షన్ నుండి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ ఫ్లైఓవర్.

మహారాజా అగ్రసేన్ జంక్షన్:

• క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ నుండి ఫిల్మ్ నగర్ జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్

• ఫిల్మ్ నగర్ జంక్షన్ నుండి రోడ్ నంబర్ 12 వైపు 2 లేన్ ఫ్లైఓవర్

క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్:

• కేబీఆర్ పార్క్ వైపు నుండి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్

• మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుండి రోడ్ నెం.10 వైపు 2-లేన్ ఫ్లైఓవర్

Also Read: Maihar Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి