Hydra Demolition: అమీన్‌పూర్‌లో 10 అక్రమ భవనాలను నేలకూల్చిన హైడ్రా

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్‌ 462లో 20 గుంటల్లోని నిర్మాణాలను మంగళవారం హైడ్రా కూల్చివేసింది. అయితే హైడ్రా ఆక్రమణల కూల్చివేతలను ఆపేందుకు ప్రయత్నించారు స్థానిక మున్సిపల్ కమిషనర్ తుమ్మల పాండురంగా ​​రెడ్డి

Published By: HashtagU Telugu Desk
Hydra Demolition

Hydra Demolition

Hydra Demolition: తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దఎత్తున వరదలు వచ్చాయి. వివిధ జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ తెలంగాణలోని 11 జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు రాష్ట్రంలో భారీ వరదలు ఆందోళన కలిగిస్తుండగా, మరోవైపు హైడ్రా తన పని చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా హైదరాబాద్ లోని అమీన్‌పూర్‌లో 10 అక్రమ భవనాలను నేలమట్టం చేసింది.

నగరంలోని పలు చెరువుల చుట్టూ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్‌ 462లో 20 గుంటల్లోని నిర్మాణాలను మంగళవారం హైడ్రా కూల్చివేసింది. అయితే హైడ్రా ఆక్రమణల కూల్చివేతలను ఆపేందుకు ప్రయత్నించారు స్థానిక మున్సిపల్ కమిషనర్ తుమ్మల పాండురంగా ​​రెడ్డి. కొన్ని భవనాలు హైడ్రా రాడార్ కిందకు వచ్చాయి. ఆక్రమిత భూమిలో నిర్మించినట్లు గుర్తించి వాటిని చదును చేశారు.

హైడ్రా అధికారులతో తుమ్మల పాండురంగా ​​రెడ్డి మాటల వాగ్వాదానికి దిగి రోడ్డుపై లారీలను నిలిపి ఆపే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. అయితే దాదాపు పది భవనాలు నేలమట్టమయ్యాయి. తహశీల్దార్ రాధ తెలిపిన వివరాల ప్రకారం.. కూల్చివేతకు ముందే భూ యజమానులకు నోటీసులిచ్చామన్నారు.

Also Read: 1000 Joining Letters : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్.. రెండేళ్ల క్రితం ఎంపికైన ఫ్రెషర్లకు జాబ్ ఆఫర్స్

  Last Updated: 03 Sep 2024, 05:36 PM IST