Site icon HashtagU Telugu

Rameshwaram Cafe Explosion : హైదరాబాద్లో హైఅలర్ట్

Rameshwaram Cafe Explosion

Rameshwaram Cafe Explosion

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు (Rameshwaram Cafe explosion) తో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) అప్రమత్తమయ్యారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో శుక్రవారం భారీ బాంబు పేలుడుతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మొదటి ఈ పేలుడుకు కారణంగా గ్యాస్ సిలిండర్ పేలడం అనుకున్నారు. కానీ, ఘటనాస్థలాన్ని, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అక్కడ జరిగింది ప్రమాదం కాదని.. పక్కా పథకంతో చేసిన బాంబు పేలుడు అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అంటూ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒక వ్యక్తి కస్టమర్ లాగా కేఫ్ లోకి వచ్చాడు. అతనితో పాటు ఒక బ్యాగును తీసుకొచ్చాడు. ఆ బ్యాగును అక్కడ వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించింది. ఈ ఐఈడీ పేలుడు తక్కువ తీవ్రత కలిగినది కావడంతో.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, పేలుడు ఘటనలో మొత్తం 9 మంది గాయపడ్డారు. ఈ ఘటన తో హైదరాబాద్ లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట వెల్లడించారు.

Read Also : Dragon Bike : డ్రాగన్ బైక్‌.. మేడిన్ ఇండియా.. సామాన్య మెకానిక్ అసామాన్య ఆవిష్కరణ