హరే కృష్ణ మూవ్‌మెంట్ (HKM) హైదరాబాద్ (Hyderabad) నార్సింగిలోని 6 ఎకరాల సువిశాల గోష్పాద క్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హరే కృష్ణ హెరిటేజ్ (Hare Krishna Heritage) టవర్‌కు భూమిపూజ కార్యక్రమాన్ని మే 8 సోమవారం నిర్వహించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 400 అడుగుల (120 మీటర్లు) ఎత్తుతో హైదరాబాద్‌లో మరో ఐకానిక్ సాంస్కృతిక మైలురాయిగా మారనున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌కు భూమి పూజ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, మధు పండిట్ దాసు సమక్షంలో నిర్వహించనున్నారు.
హరే కృష్ణ హెరిటేజ్ టవర్ టెంపుల్ కాంప్లెక్స్‌లోని గ్రాండ్ టెంపుల్ హాల్‌లో శ్రీ రాధా మరియు కృష్ణ దేవతలతో పాటు అష్టసఖిలుగా పిలువబడే ఎనిమిది మంది గోపికలను ప్రతిష్టించనున్నారు. తిరుమలలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం స్ఫూర్తితో శ్రీ శ్రీనివాస గోవిందానికి అంకితం చేయబడిన పెద్ద ప్రాకారంతో సంప్రదాయ రాతితో చెక్కబడిన ఆలయం ఉంటుంది. ఈ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి చెందిన అద్భుతమైన వారసత్వాన్ని చాటిచెబుతుందని, కాకతీయ, చాళుక్యులు, ద్రావిడ మరియు ఇతర పురాతన శైలుల నుండి నిర్మాణ అంశాలను తీసుకుంటుందని సత్య గౌర చంద్ర దాసు చెప్పారు.
Also Read: Minister KTR : హన్మకొండలో నాలుగు ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హరే కృష్ణ హెరిటేజ్ టవర్ క్యాంపస్‌లో పిల్లలు, యువత, కుటుంబాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విద్య కోసం లైబ్రరీ, మ్యూజియం, మల్టీ-విజన్ థియేటర్, BG హాల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. హోలోగ్రామ్‌లు, లేజర్ ప్రొజెక్షన్ వంటి సరికొత్త సాంకేతికతలతో అనుసంధానించబడిన వివిధ ఆకర్షణలు సందర్శకులకు ఆకర్షణీయమైన, లీనమయ్యే అనుభవాలను సృష్టిస్తాయి. మన గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ఆకర్షణీయంగా ప్రదర్శిస్తాయి. పెద్ద వైదిక సంకారా హాలు, యాత్రికుల అతిథి గదులు వంటి సౌకర్యాలు ఉన్నాయి. వీటిని పెద్ద సమావేశాలకు ఉపయోగించుకోవచ్చు.
ప్రాజెక్ట్‌లో సీనియర్ సిటిజన్లు, వికలాంగ సందర్శకుల కోసం ఎలివేటర్లు, ర్యాంప్‌లు కూడా ఉంటాయి. భక్తులు హాయిగా వేచి ఉండి దేవతా దర్శనం చేసుకునేందుకు వీలుగా విశాలమైన క్యూలైన్ హాలును నిర్మించనున్నారు. ఉచిత అన్నదాన మందిరం (సామూహిక భోజన సౌకర్యం) యాత్రికులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. “నార్సింగిలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌కి భూమిపూజ, శంకు స్థాపనను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో పాటు ఇతర ప్రముఖులు రావటం మేము సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్త హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకుడు ఆచార్య ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదకు ఈ ప్రాజెక్ట్ మా వినయపూర్వకమైన నివాళి” అని సత్య గౌర చంద్ర దాస అన్నారు.