తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న అతివృష్టి వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షపాతం ఎడతెరిపి లేకుండా కొనసాగుతుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు మూసీ నదిలో చేరి ఉగ్రరూపం దాల్చింది. మహాత్మా గాంధీ బస్టాండ్ (ఎంజీబీఎస్) రాత్రి నుంచే వరదనీటిలో మునిగిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం నీటమునిగి జీవన విధానం దెబ్బతిన్నది.
America: భారత్‌లో పర్యటించనున్న అమెరికా ప్రతినిధులు.. అగ్రరాజ్యానికి మోదీ సర్కార్ కండీషన్!
మూసీ నది ఉద్ధృతితో మూసారాంబాగ్ పాత వంతెనపై సుమారు 10 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను కూడా వరద నీరు తాకుతూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అంబర్‌పేట్ – దిల్‌సుఖ్‌నగర్ మధ్య రహదారిని పూర్తిగా మూసివేయగా, చాదర్‌ఘాట్ వంతెనను కూడా రాకపోకలకు నిలిపివేశారు. వంతెనల పై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు, పాదచారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మార్గమళ్లింపులు చేపట్టారు.
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత!
మూసీ పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగి ఉండటంతో ప్రజలను అత్యవసరంగా పునరావాస కేంద్రాలకు తరలించడం ప్రారంభించారు. డీఆర్ఎఫ్, పోలీస్, జీహెచ్‌ఎంసీ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా మూసారాంబాగ్, చాదర్‌ఘాట్, అంబర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తత సూచనలు చేస్తున్నారు. మూసీ నది ఉద్ధృతి కొనసాగుతుండటంతో ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
