Site icon HashtagU Telugu

PM Modi Hyderabad : మోడీకి నిర‌స‌న బ్యాన‌ర్ల స్వాగ‌తం!

Modi Flexi

Modi Flexi

ప్ర‌ధాని మోడీకి ఒక వైపు ప్లెక్సీల‌తో ఐఎస్ బి స్వాగతం మ‌రోవైపు ఆయ‌న్ను నిల‌దీస్తూ ప్ర‌శ్న‌ల‌తో కూడిన బ్యాన‌ర్లు హైద‌రాబాద్ న‌గ‌ర రోడ్ల వెంటక‌నిపిస్తున్నాయి. ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు బేగంపేట విమానాశ్రయం పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు మోడీని ప్రశ్నిస్తూ నగర యువత పేరుతో బ్యానర్లు కట్టారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 17 బ్యానర్లు కట్టారు. ఆ ఫ్లెక్సీల్లోని ప్ర‌శ్న‌ల‌కు సమాధానం చెప్పాలని మోడీని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్తున్నారు. అయితే, గురువారం నాటి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండరని వస్తున్న వార్తలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గురువారం కేసీఆర్‌పై విరుచుకుపడింది. ప్రధాని రాక నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని బీజేపీ మండిపడింది.

జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామిలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయంలో దిగనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు విమానాశ్రయ పార్కింగ్‌లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. 1.50 నిమిషాల్లో హెలికాప్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి గచ్చిబౌలి ఐఎస్‌బీకి వెళ్లాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.15 గంటల మధ్య జరిగే ఐఎస్ బి వార్షికోత్సవానికి హాజరవుతారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు బేగంపేట నుంచి చెన్నైకి బయలుదేరుతారు.

తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వస్తుంటే.. సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో మాజీ ప్రధాని దేవెగౌడ భేటీ కానున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి లీలా ప్యాలెస్ హోటల్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు