Site icon HashtagU Telugu

GHMC Scam: జీహెచ్‌ఎంసీలో సరికొత్త కుంభకోణం

GHMC Scam

GHMC Scam

GHMC Scam: జీహెచ్‌ఎంసీలో కొత్త కుంభకోణం బయటపడింది. ఇది తెలుసుకున్న పై అధికారులు అవాక్కయ్యారు. పారిశుద్ధ్య కార్మికుల ఫొటోలను ఉపయోగించి నకిలీ హాజరును గుర్తించి, అసలు ఉద్యోగుల కోసం ఉద్దేశించిన నిధులను స్వాహా చేస్తున్నారు కొందరు అధికారులు. పారిశుధ్య కార్మికులు విధుల్లో లేనప్పటికీ, ఈ అధికారులు బయోమెట్రిక్ విధానంలో వారి హాజరును నమోదు చేస్తున్నారని, దీంతో గైర్హాజరైన కార్మికులకు జీతాలు తీసుకుంటున్నారు.

గతంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ABAS)లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు బల్దియా ఏప్రిల్ 1న ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే పాత విధానాన్ని ఎస్‌ఎఫ్‌ఏలు, శానిటరీ సూపర్‌వైజర్లు దుర్వినియోగం చేశారు. ఈ స్కామ్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ గుర్తింపు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకుంటున్న కొంతమంది శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌లు (SFAలు) మరియు మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు.

ఇటీవల చార్మినార్‌, గోషామహల్‌, ముషీరాబాద్‌ సర్కిళ్లలో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించగా అధికారుల ఫొటోలను ఉపయోగించి తప్పుడు హాజరు గుర్తులు వేస్తున్నట్లు గుర్తించారు.

Also Read: Road Accident: ఐదుగురు మహిళ రైతులను పొట్టన పెట్టుకున్న లారీ

Exit mobile version