Site icon HashtagU Telugu

Doctor : చికిత్స కోసం వ‌చ్చిన మ‌హిళ‌పై డాక్ట‌ర్ లైంగిక వేధింపులు.. ఆరేళ్ల త‌రువాత శిక్ష

Doctor Imresizer

Doctor Imresizer

హైదరాబాద్: ఆరేళ్ల క్రితం మహిళా రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఓ వైద్యుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ హైదరాబాద్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. సికింద్రాబాద్‌లోని తన ఆసుపత్రిలో 54 ఏళ్ల రోగిని లైంగికంగా వేధించిన కేసులో దోషిగా నిర్ధారించిన కోర్టు వైద్యుడికి రూ. 5,000 జరిమానా విధించింది. ఈ ఘటన 2016లో జరగగా బాధితురాలి ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో పల్మోనాలజిస్ట్‌పై కేసు నమోదైంది. బి. విజయ్ భాస్కర్ అనే డాక్టర్‌ను అరెస్టు చేశారు. అయితే బెయిల్‌పై విడుదల చేశారు. నిందితులపై ఆధారాలు సేకరించి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వైద్యుడిపై ఐపీసీ 376, 354 సెక్షన్లు కింద కేసు పెట్టారు. విచారణ అనంతరం కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు మే 2016లో శ్వాసకోశ సమస్యకు చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించింది. వైద్యుడు తన ప్రైవేట్ పార్ట్‌ల‌ను తాకినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆమె అతనిని ప్రశ్నించగా అతను చికిత్సలో భాగమని ఆమెను ఒప్పించాడు.సెప్టెంబరు 24, 2016న, ఆ మహిళ తనతో అసభ్యంగా ప్రవర్తించిన అదే వైద్యుడిని సంప్రదించింది. అదే ఏడాది అక్టోబరు 7న మూడోసారి ఆస్పత్రికి వెళ్లగా.. ఓ యువతి డాక్టర్‌తో వాదిస్తూ కనిపించింది. బాధితురాలు యువతితో కూడా డాక్టర్ దురుసుగా ప్రవర్తించాడని, దీంతో డాక్టర్ తనను వేధించాడని గ్రహించింది. దీంతో ఆమె తన భర్తకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2016లో మరో మహిళ సదరు వైద్యుడిపై ఫిర్యాదు చేసిందని.. అయితే ఈ కేసులో సదరు వైద్యుడు నిర్దోషిగా బయటపడ్డాడని పోలీసులు తెలిపారు

Exit mobile version