Hyderabad CP CV Anand: హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) బౌన్సర్లకు, ప్రైవేట్ బాడీ గార్డ్స్‌కు హెచ్చరికలు జారీ చేశారు. బౌన్సర్లను, ప్రైవేట్ బాడీ గార్డ్స్‌ను నియమిస్తున్న ఏజెన్సీలను హైదరాబాద్ సీపీ హెచ్చరించారు. సామాన్య ప్రజలపై దాడులు సహించబోమని, బౌన్సర్ల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై, నిర్వాహకులపై కూడా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. బౌన్సర్లు అందరికీ వార్నింగ్ ఇవ్వదల్చుకున్నాను. ఈ బౌన్సర్లు సప్లై చేసిన ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైమ్ నుండి ఈ బౌన్సర్లు ఎక్కడైనా మిస్‌బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్లు యూనిఫామ్‌లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలే ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్లను మీరు చూశారు కదా వీడియోస్. పబ్లిక్‌ని తోసేస్తున్నారు. వాళ్లే గేట్లు ఓపెన్ చేస్తున్నారు వాళ్లే క్లోజ్ చేస్తున్నారు. వాళ్లే అన్ని చేస్తున్నారు అక్కడా సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్లీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి. ఈట్స్ బికమింగ్ ఏ ఛాలెంజ్. సో ఇప్పటినుండి వీఐపీస్ వీవీఐపీస్ ఎవరైనా కానివ్వండి. పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్లు సప్లై చేసే ఏజెన్సీలదే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దాని వల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా. అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సన్డ్ వీఐపీదే ఇది తర్వాత ఇది అయింది అది అయింది అని ఎక్స్‌ప్లనేషన్ ఏదీ కూడా పని చేయవు ఈట్ ఈజ్ దేర్ రెస్పాన్స్‌బులిటీ అండ్ వీ హ్యావ్ రెస్పాన్స్‌బుల్ పీపుల్ అని ఆయన డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు.
Also Read: CM Revanth Reaction: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే!
బౌన్సర్లను, ప్రైవేట్ బాడీ గార్డ్స్ ను, వీరిని నియమిస్తున్న ఏజెన్సీలను హెచ్చరించిన హైదరాబాద్ సీపీ @CPHydCity
సామాన్యప్రజలపై దాడులు సహించబోము. బౌన్సర్ల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై, నిర్వాహకులపై కూడా అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. @CVAnandIPS #TelanganaPolice pic.twitter.com/mfor76UYii— Telangana Police (@TelanganaCOPs) December 22, 2024
తెలంగాణ పోలీస్ శాఖ కూడా హెచ్చరిక
బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డ్స్‌కైనా పరిమితులు ఉంటాయని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖ తన ఎక్స్ ఖాతా ద్వారా బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డులపై ఆసక్తికర పోస్ట్ చేసింది. బౌన్సర్లు, ప్రైవేట్ బాడీ గార్డ్స్ పేరుతో చట్టానికి వ్యతిరేకంగా ఎవరిపైనైనా దాడులు, బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించింది.