Site icon HashtagU Telugu

CV Anand : నేషనల్ మీడియాను కొనేశారంటూ వ్యాఖ్యలు.. క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

Hyderabad Cp Cv Anand Vs National Media Allu Arjun

CV Anand  : ‘‘నేషనల్ మీడియాను కొనేశారు’’ అంటూ చేసిన వ్యాఖ్యలకుగానూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఇవాళ తెల్లవారుజామున 2 గంటల 49 నిమిషాలకు ఎక్స్‌ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు.  ‘‘అల్లు అర్జున్  ‘పుష్ప 2’ ప్రీమియర్ షో పై అసహనం పుట్టించేలా వరుస ప్రశ్నలు అడగడంతో నేను కూల్ కోల్పోయి నేషనల్ మీడియాపై అనవసరమైన జనరల్ వ్యాఖ్యలు చేశాను. ఆవిధంగా కూల్ కోల్పోయినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. అసహనం పుట్టించే ప్రశ్నలు నన్ను అడిగినందుకు చింతిస్తున్నాను.  నేను కూల్ కోల్పోకుండా కామ్‌గా ఉండాల్సింది. నేను నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను’’ అని తన ట్వీట్‌లో  సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Also Read :Vastu Tips: మీ వంటగదిలో ఈ తప్పులు చేయకండి.. ముఖ్యంగా ఈ వ‌స్తువుల‌ను కిచెన్‌లో ఉంచ‌కండి!

ఇక ఆదివారం రోజు మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బౌన్సర్లకు ఆయన సీరియస్ వార్నింగ్(CV Anand) ఇచ్చారు. పబ్లిక్‌ను ఎక్కడైనా తోసేస్తే తాటతీస్తామని తేల్చి చెప్పారు. బౌన్సర్లు ఏం చేసినా.. సెలబ్రిటీలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. యూనిఫాంలో ఉన్న పోలీసులను టచ్ చేసినా, ఆ తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. బౌన్సర్లను సప్లై చేసే ఏజెన్సీలు కూడా బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.

Also Read :Flashback Sports: 2024లో క్రీడ‌ల్లో భార‌త్ సాధించిన అతిపెద్ద విజ‌యాలివే!

‘‘పుష్ప 2 ప్రీమియర్ షోను చూసేందుకు  సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌ వెళ్లారు. తొక్కిసలాట, తోపులాట జరుగుతోందని అల్లు అర్జున్‌కు పోలీసులు చెప్పారు. అయినా ఆయన సినిమా చూస్తూనే కూర్చున్నారు. ఏసీపీ చెప్పినా అల్లు అర్జున్ వినలేదు. దీంతో డీసీపీ వెళ్లి గట్టిగా చెప్పడంతో అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు వెళ్లారు’’ అని సీవీ ఆనంద్ చెప్పారు. అల్లు అర్జున్‌కు డీసీపీ రూట్‌ను క్లియర్ చేస్తూ పంపిస్తున్న వీడియోలను సీవీ ఆనంద్ విడుదల చేశారు. ప్రైవేట్ బౌన్సర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది పోలీసులను సైతం నెట్టివేస్తున్నట్టుగా ఆ వీడియోల్లో ఉందని సీవీ ఆనంద్ చెప్పారు. ఇకపై ఇలాంటివి జరిగితే బౌన్సర్లపై కఠిన చర్యలు తప్పవన్నారు. తాను వెంటనే సంధ్య థియేటర్ నుంచి వెళ్లిపోయానని అల్లు అర్జున్ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని సీవీ ఆనంద్‌  పేర్కొన్నారు.