Hyd Cops: ప‌బ్ కి వెళ్తున్నారా.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మస్ట్!

మ‌హాన‌గ‌రంలో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై పోలీసులు నిఘా పెంచారు. క‌రోనా వైర‌స్‌, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో బ‌హిరంగ ప్ర‌దేశాలు ఎక్కువ‌మందిని గుమిగూడ‌కుండా ఉండేలా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - December 30, 2021 / 11:05 AM IST

మ‌హాన‌గ‌రంలో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై పోలీసులు నిఘా పెంచారు. క‌రోనా వైర‌స్‌, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో బ‌హిరంగ ప్ర‌దేశాలు ఎక్కువ‌మందిని గుమిగూడ‌కుండా ఉండేలా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు పరిధిలోని త్రీ స్టార్‌, ఆపైన హోటళ్లు, క్లబ్‌లు, పబ్‌లు ల‌కు పోలీసులు గైడ్ లైన్స్ విధించారు. రెండు డోసుల వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ లేదా ఫిజికల్‌ సర్టిఫికెట్ ఉన్న వారిని మాత్ర‌మే నూతన సంవత్సర వేడుకలకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్వాహకులు కూడా వేదికలోకి మాస్క్ లేకుండా వెళ్ల‌కూడ‌ద‌ని.. వేదిక‌పై కూడా మాస్క్ లేని వ్యక్తులను అనుమతించకుండా చూసుకోవాలని తెలిపారు. వేదికపైకి ప్రవేశించే వ్యక్తులను స్కాన్ చేయడానికి ఎంట్రీ పాయింట్ వద్ద థ‌ర్మ‌ల్ స్క్రీన్ ఏర్పాటు చేయాల‌ని మూడు కమిషనరేట్లు పేర్కొన్నాయి.

కోవిడ్ ప్రోటోకాల్‌లు,భౌతిక‌ దూరాన్ని ఉల్లంఘించే సామర్థ్యానికి మించి టిక్కెట్లు, పాస్‌లు లేదా కూపన్‌లు జారీ చేయబడకుండా చూసుకోవాలని నిర్వాహకులను కోరారు. GO నెం.82 ప్ర‌కారం బ‌హిరంగ‌ ప్రదేశాల్లో వ్యక్తులు మాస్క్ ధరించకుంటే రూ. 1,000 జరిమానా విధించబడుతుంది. వేదిక వద్ద ఉన్న సిబ్బంది, నిర్వాహకులందరికీ గత 48 గంటల్లో కోవిడ్-19 నెగిటివ్‌గా పరీక్షించబడాలని.. అలాగే, నిర్దేశించిన నిబంధనలు, స్పెసిఫికేషన్ ల్లో శానిటైజర్లు/హ్యాండ్-రబ్‌తో పాటు వేదిక వద్ద ఉన్న వ్యక్తులందరికీ సర్జికల్ మాస్క్‌లు అందించాలని పేర్కోన్నారు. తాత్కాలిక వినోద లైసెన్సు మంజూరు కోసం నిర్వాహకులు పోలీసు కమిషనర్ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది.