Site icon HashtagU Telugu

Hyderabad City Police: కుమారి ఆంటీని ఫాలో అయిన పోలీసులు

Hyderabad City Police

Hyderabad Traffic Police

Hyderabad City Police: మీది మొత్తం తౌజండ్ (1000 రూపాయలు) అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. ఈ డైలాగ్ సుపరిచితమే. ఈ ఒక్క డైలాగ్ ద్వారా కుమారీ అనే మహిళా సోషల్ మీడియాలో సెలేబ్రిటిగా మారిపోయింది. హైదరాబాద్ లో మధ్యాహ్న సమయంలో ఓ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బ్రతుకు జీవనం సాగించే ఈ మహిళ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ లోని మాదాపూర్ పరిసర ప్రాంతమైన కోహినూర్ హోటల్ సమీపంలో కుమారీ అనే మహిళ ఫుడ్ స్టాల్ నడుపుతున్న విషయం తెలిసిందే. ఫుడ్ కోసం ఆమె వద్దకు వచ్చిన వారితో ఎంతో మర్యాదగా అమ్మ, నాన్న అంటూ భోజనం పెడుతుంటారు. అయితే ఒకరోజు ఓ వ్యక్తి చేసిన బిల్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ వ్యక్తితో.. మీది మొత్తం తౌజండ్ (1000 రూపాయలు) అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా అని చెప్పడం, అది కాస్త ట్రెండింగ్ అయింది. దాంతో యూట్యూబర్స్ ఆమెను ఇంటర్వ్యూలు చేస్తూ మరింత హైలైట్ చేశారు. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి కుమారీ ఆంటీ వద్ద ఫుడ్ తినాలని ఉందని చెప్పడంతో ఆమె పేరు మారుమ్రోగింది. కట్ చేస్తే హైదరాబాద్ నగర పోలీసులు కుమారీ ఆంటీ డైలాగ్ ని వాడేసి ఆమెను మరోసారి చర్చల్లోకి తీసుకొచ్చారు.

హైదరాబాద్ రోడ్డుపై ఓ వాహనదారుడు హెల్మెట్ లేకుండా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండగా ఆ ఫొటోను ట్వీట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు కుమారీ ఆంటీ డైలాగ్ ని వాడేశారు. మీది మొత్తం థౌజండ్ అయింది.. యూజర్ చార్జీలు ఎక్స్ ట్రా అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రూల్స్‌పై జనాల్లో అవగాహన పెంచడానికి.. హైదరాబాద్ పోలీసులు వివిధ పద్ధతులను ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, ఫన్నీ పోస్టులతో పరోక్షంగా ట్రాఫిక్ రూల్స్ గుర్తుచేస్తున్నారు.

Also Read: Good News : ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష వరకు పన్ను నోటీసులు విత్‌డ్రా