Hyderabad T20 Tickets: హైదరాబాద్ కు ‘ట్వీ20’ ఫీవర్.. జింఖానా గ్రౌండ్ లో హైటెన్షన్!

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ లో సెప్టెంబర్ 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో T20కి ఆతిథ్యం ఇవ్వనుండగా,

  • Written By:
  • Updated On - September 21, 2022 / 02:36 PM IST

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ లో సెప్టెంబర్ 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో T20కి ఆతిథ్యం ఇవ్వనుండగా, అంతర్జాతీయ క్రికెట్‌కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. గత మూడేళ్లుగా టాప్-క్లాస్ క్రికెట్ లేకపోవడంతో జంట నగరాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టికెట్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఉత్కంఠతకు దారితీసింది. Paytm ఇన్‌సైడ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవడం ఇబ్బందిగా మారినప్పటికీ, ఆఫ్‌లైన్ టిక్కెట్ల విక్రయంపై ఇంకా స్పష్టత లేదు.

సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో బుధవారం జరిగిన దృశ్యాలు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. టిక్కెట్ల కోసం గత రెండు రోజుల నుంచి మైదానంలో క్యూలు కట్టినా అసొసియేషన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. గ్రౌండ్‌కి ఎవరు వచ్చినా నిరాశనే ఎదురవుతోంది.

అయితే అధికారుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సెప్టెంబర్ 21న ఆన్‌లైన్‌లో విడుదల చేసినప్పటి నుండి నేను టిక్కెట్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నేను ఆన్‌లైన్‌లో ఒక్కటి కూడా కొనలేకపోయాను. ఆన్‌లైన్ టిక్కెట్‌లు అందుబాటులో లేవు. దీంతో ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ఇక్కడకు వచ్చాను. టిక్కెట్ల విక్రయం ఇంకా ప్రారంభం కాలేదన్నారు. వాటిని ఎప్పుడు విక్రయిస్తారో తెలియజేయడానికి ఇక్కడ నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు’ అని ఐటీ ఉద్యోగి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.