హైదరాబాద్ కుర్రాడు (Hyderabad Boy) అగస్త్య జైస్వాల్ 16 ఏళ్ల వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి భారతీయ కుర్రాడు. హైదరాబాద్ (Hyderabad Boy)కు చెందిన అగస్త్య జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. అతను 16 సంవత్సరాల వయస్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. దీంతో భారతదేశంలోనే అతి పిన్న వయసులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మొదటి అబ్బాయిగా అగస్త్య చరిత్ర సృష్టించాడు. ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన ఫైనల్ ఇయర్ పరీక్షల్లో ఫస్ట్ డివిజన్ మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.
అగస్త్య జైస్వాల్‌కి ఇది మొదటి రికార్డు కాదు. గతంలో కూడా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 2020లో 14 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేశాడు. దీంతో భారతదేశంలోనే అతి పిన్న వయసులో డిగ్రీ పూర్తి చేసిన మొదటి అబ్బాయిగా పేరు తెచ్చుకున్నాడు. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో బీఏ డిగ్రీ పూర్తి చేశాడు. అంతకుముందు.. అతను 9 సంవత్సరాల వయస్సులో SSC బోర్డు పరీక్షలను క్లియర్ చేసిన తెలంగాణలో మొదటి బాలుడు అయ్యాడు.
Also Read: TSRTC: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు
అగస్త్య జైస్వాల్ 16 సంవత్సరాల వయస్సులో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన దేశంలోనే అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. ఈ సందర్భంగా జైస్వాల్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు నాకు గురువులు. మా నాన్న అశ్విని కుమార్ జైస్వాల్, తల్లి భాగ్యలక్ష్మి జైస్వాల్ చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. నేను సవాళ్లను అధిగమించి ఏదీ అసాధ్యం కాదని నిరూపించాను అని పేర్కొన్నాడు.