Site icon HashtagU Telugu

Vande Bharat Express: త్వరలో ‘హైదరాబాద్- బెంగళూరు’ వందే భారత్ రైలు ప్రారంభం

Vande Bharat Express

Tirumala Vande Bharat

దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య  వెళ్లే వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. కాచిగూడ, యశ్వంత్‌పూర్ మధ్య వందే భారత్ (VB) ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్టులో పరుగులు తీసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ రైలు యశ్వంత్‌పూర్ మరియు కాచిగూడ మధ్య ఏడు గంటల్లో 610 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఇది ప్రస్తుత వేగవంతమైన రైలు (దురంతో ఎక్స్‌ప్రెస్) కంటే రెండు గంటలు వేగంగా ఉంటుంది. “మేం గత రెండు రోజులుగా కాచిగూడ, ధోన్ మధ్య ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాg. మేము పూర్తి స్థాయి రైలు సెట్‌ను పొందిన వెంటనే రైలును ప్రారంభిస్తాం ”అని SCR అధికారి మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉంది.

ప్రారంభ తేదీ, ఛార్జీల నిర్మాణం, స్టాపేజ్‌లు, ప్రయాణ వ్యవధి వంటి కీలకమైన అంశాలు రైల్వే బోర్డు నుండి అనుమతి పొందిన తర్వాత మాత్రమే సెట్ చేయబడతాయి. కర్ణాటకలోని మొదటి రెండు వందే భారత్ రైళ్లు మైసూరును బెంగళూరు ద్వారా చెన్నైతో, బెంగళూరును ధార్వాడ్‌తో కలుపుతాయి. తెలంగాణలో మొదటి రెండు వందే భారత్ రైళ్లు సికింద్రాబాద్‌ను విశాఖపట్నం, తిరుపతితో కలుపుతాయి. ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు, హైదరాబాద్ మధ్య మరిన్ని సంబంధాలు మెరుగు పడుతాయి.

Also Read: Budvel Lands: కోట్లు కురిపించిన కోకాపేట, బుద్వేల్ భూములపై బీఆర్ఎస్ ప్రభుత్వ కన్ను!