Site icon HashtagU Telugu

World Green City: హైదరాబాద్‌కు ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు’.. దేశంలోనే ఏకైక నగరం!

Hyderabad1

Hyderabad1

ఇప్పటికే స్వచ్ఛ దివాస్ అవార్డులను దక్కించుకున్న తెలంగాణ మరో అవార్డును కైవసం చేసుకుంది. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (AIPH) 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022’,  ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్’ విభాగంలో అవార్డులను గెలుచుకుంది.

అయితే గ్రీన్ అవార్డును దక్కించుకోవడంలో ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ మాత్రమే. ‘వరల్డ్ గ్రీన్ సిటీ 2022’ అవార్డును గెలుచుకోవడం తెలంగాణ, భారతదేశానికి గర్వకారణం. ఈ సందదర్భంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ బృందం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏ అండ్ యుడి అరవింద్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

నగరానికి ప్రతిష్టాత్మకమైన అవార్డులు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణ, దేశ ఖ్యాతిని మరింత బలోపేతం చేశాయన్నారు. దేశానికి హరిత ఫలాలను అందజేస్తున్న హరితహారం. పట్టణాభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోందనడానికి ఈ అంతర్జాతీయ అవార్డులే నిదర్శనమని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గర్వకారణమని ఆయన అన్నారు.