Site icon HashtagU Telugu

Laad bazaar Bangles: మన ‘లాడ్‌ బజార్‌’ గాజులకు భౌగోళిక గుర్తింపు!

Laad Bazaar 22

Laad Bazaar 22

హైదరాబాద్… దేశంలోనే ప్రధాన నగరాల్లో ఒకటి మాత్రమే కాదు.. ఓ మినీ ఇండియా కూడా. అందుకే మన భాగ్యనరగానికి విదేశాల్లో సైతం విశిష్ట గుర్తింపు ఉంది. హైదరాబాద్ అనగానే బిర్యానీ, హలీం లాంటి పేరొందిన వంటకాలు గుర్తుకువస్తాయి. ఇప్పటికే మన హలీంకు ప్రత్యేకమైన పేరుంది. తాజాగా లాడ్ బజార్ కు విశిష్ట స్థానం దక్కించుకుంది. హ్యాండ్‌ మేడ్ లాక్ బ్యాంగిల్స్ కు జీఐ గుర్తింపు (భౌగోళిక గుర్తింపు) దక్కింది. అయితే హైదరాబాదీ హలీమ్‌కు 2010 లో తొలిసారిగా ఈ హోదా లభించింది. మళ్లీ చాలా కాలం తర్వాత మన గాజులకు ఆ గుర్తింపు దక్కింది.

హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్ కు GI గుర్తింపు అధికారికంగా నమోదైంది.. శ్రీమతి శ్రీహా రెడ్డి, పరిశ్రమ వాణిజ్య శాఖ నుంచి GI నోడల్ ఆఫీసర్ శ్రీహ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ వాణిజ్యం, ఎగుమతి ప్రోత్సాహక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుదిన్ పాల్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు. తరతరాలుగా చాలా క్లిష్టమైన, చక్కగా డిజైన్ చేయబడిన బ్యాంగిల్స్‌ ను ఎంతోమంది మగువలు వేసుకుంటుంటారు. అంతేకాదు.. ఈ గాజులకు దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. దేశం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులు ఎవరైనా హైదరాబాద్ కు వస్తే లాడ్ బజార తప్పకుండా సందర్శిస్తారంటే.. మన గాజుల ప్రత్యేకత ఎంటో ఇట్టే అర్థమవుతోంది. మన గాజులకు GI గుర్తింపు దక్కడంతో సిటీ జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version