Hyderabad: మరిచిపోలేని రోజు.. గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లకు 16 ఏళ్లు

భాగ్యనగరవాసులకు అదోక చీకటి రోజు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని రోజు. అదే ఆగష్టు 25, 2007. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల (Gokulchat, Lumbini Park Blasts) విషాదానికి నేటితో 16 ఏళ్లు పూర్తి అయ్యాయి.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 08:59 AM IST

Hyderabad: భాగ్యనగరవాసులకు అదోక చీకటి రోజు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని రోజు. అదే ఆగష్టు 25, 2007. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల (Gokulchat, Lumbini Park Blasts) విషాదానికి నేటితో 16 ఏళ్లు పూర్తి అయ్యాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల దుర్ఘటనకు నేటితో 16 ఏళ్ళు పూర్తయ్యాయి. 2007 ఆగస్టు 25 కోఠిలోని గోకుల్ చాట్, సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో కొద్ది సమయం తేడాలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి చాలామంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్ఛాలుగా మారిపోయారు.

ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం చర్లపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన స్పెషల్ కోర్టు అనిక్ షఫిక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి అనే ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. వీరికి ఆశ్రయం ఇచ్చిన తారిఖ్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Also Read: Warangal Earthquake : వరంగల్ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. రోడ్లపైకి జనం పరుగులు

నాడు ముఖ్యమంత్రిగా వైఎస్సార్ బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన మొక్కుబడిగా సాయం అందించి చేతులు దులుపుకున్నారు. ఈ ఘటనలో నాటి యువ ఇంజనీర్లు, డాక్టర్లు కాలేజీ విద్యార్థులు, పలువురూ తమ శరీరంలో అవయవాలను కోల్పయి జీవచ్ఛవంలా నేటికి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకున్న అన్ని పార్టీలు ప్రభుత్వాలు మారి 16 ఏళ్ళైన బాధితులకు నేటికి అందని ద్రాక్షల మారింది.