Bail Granted To Agnipath Protests: అగ్నిపథ్ వీరులకు బెయిల్ మంజూరు!

జూన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలకు

Published By: HashtagU Telugu Desk
Agnipath

Agnipath

జూన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలకు ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అరెస్టు చేసిన వారిలో 16 మందికి సోమవారం బెయిల్ మంజూరైంది. కోచింగ్‌ సెంటర్‌ యజమాని అవ్వుల సుబ్బారావు సహా ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఎవరికీ బెయిల్‌ లభించలేదు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నిరసనలకు సంబంధించి రైల్వే పోలీసులు ఇప్పటివరకు 64 మందిని అరెస్టు చేశారు.

రైళ్లను తగలబెట్టడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, హింసకు కారణమైనందుకు నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్ హింసకు ప్రధాన కుట్రదారుని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. “కొన్ని పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా వారిలో 16 మందికి బెయిల్ మంజూరైంది. సోమవారం జైలు నుంచి విడుదలయ్యారు. నిరసనల సందర్భంగా గాయపడి ఒకరు మృతి చెందడం గమనార్హం.

  Last Updated: 02 Aug 2022, 12:52 PM IST