హైదరాబాద్ (Hyderabad) లో భారీ పలుచోట్ల భారీ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) జరిగి ప్రాణ , ఆస్థి నష్టం వాటిల్లింది. ముఖ్యంగా నాంపల్లి బజార్‌ఘాట్ (Bazaar Guard)లోని నాలుగు అంతస్థుల భవనంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పూర్తిస్థాయి దర్యాపునకు ఆదేశించారు. కొద్దీ సేపటి క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ (KTR) అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనపై మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తామన్నారు. ప్రమాదంలో ఆస్తి నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారి తో పాటు ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతులను ఎండీ ఆజాం (58), రెహానా సుల్తానా (50), ఫైజా సమీన్ (26), తాహూరా ఫరీన్ (35), తూబా (6), తరూబా (13), ఎండీ జకీర్ హుస్సేన్ (66), హసిబ్ -ఉర్-రహ్మాన్ (32), నికత్ సుల్తానా (55)గా గుర్తించారు. మృతుల్లో బీడీఎస్ డాక్టర్ తాహూరా ఫర్హీన్ ఈ బిల్డింగ్‌లో నివాసం ఉండరని.. సెలవుల నేపథ్యంలో పిల్లలను తీసుకొని బంధువుల ఇంటికి వచ్చారని పోలీసులు పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే ఈరోజు ఉదయం అమీర్‌పేట్, పాతబస్తీల్లో రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్‌పేట్ పరిధిలోని మధురానగర్‌లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గోదాంలోని లక్షల విలువైన ఫర్నీచర్ కాలి బూడిదైంది. పాతబస్తీలోని షాలిబండ ఏరియాలోగల బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దుకాణంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని ఆదిత్య కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరుగగా క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also : Vijay Rashmika : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలెబ్రేషన్స్? మరోసారి దొరికేశారు..