హుజురాబాద్‌లో 7 గంటల వరకు 86.3% పోలింగ్‌

హుజూరాబాద్ నియోజవర్గం పరిధిలో మొత్తం 306 పోలింగ్‌ స్టేషన్లలో 2,37,036 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.

  • Written By:
  • Updated On - October 30, 2021 / 10:26 PM IST

హుజూరాబాద్ నియోజవర్గం పరిధిలో మొత్తం 306 పోలింగ్‌ స్టేషన్లలో 2,37,036 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌కు, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరుపున కూడా ఆ పార్టీ అగ్రనేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ స్థానంలో మొత్తం 30 మంది పోటీలో ఉన్నారు. 2 లక్షల 37 వేల 22 మంది ఓటర్లల్లో మహిళలు లక్షా 17 వేల 563 మంది, పురుషులు లక్షా 18వేల 720 మంది ఉన్నారు. అధికారులు 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 172 సమస్యాత్మకమైనవిగా, 63 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి అదనపు భద్రతా సిబ్బంందిని మోహరించారు.

  • హుజూరాబాద్‌లో సాయంత్రం 5 గంటల వరకు 76.26 పోలింగ్‌ శాతం

  • నగదు సీజ్‌

    హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటి వరకు రూ.3.50 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని అన్నారు. విచారణలో నిజాలు తేలితే చర్యలు తప్పవని శశాంక్‌ గోయల్‌ అన్నారు.

  • హుజూరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 పోలింగ్‌ శాతం

    హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

  • హుజూరాబాద్‌ పోలింగ్‌పై కిషన్‌రెడ్డి ట్వీట్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. ఉన్నతమైన పాలన కోసం మర్ధుడైన నాయకుడికి ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

  • మ.1 గం. వరకు 45.63% పోలింగ్

  • టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రామం హిమ్మత్‌నగర్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నాయకురాలు తుల ఉమ పోలింగ్ కేంద్రానికి రావడంపై టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

  • 2 టీవీ ఛానెళ్లపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

    హైదరాబాద్ : హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలు, 2 తెలుగు మీడియా సంస్థలు రూల్స్ పాటించలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి మీడియాతో మాట్లాడటం, కార్యకర్తలు ప్రచారం చేయడం అంశాలపై మెయిల్ ద్వారా ఈసీఐకి ఫిర్యాదు చేసింది. రాజ్ న్యూస్, వీ6 న్యూస్ ఛానెళ్లపై కేంద్రానికి కంప్లయింట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ.

  • కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ

    కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సెగ్మెంట్ లో ఉపఎన్నిక పోలింగ్ హైటెక్కిస్తోంది. వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డికి, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు కారణమైంది. పోలింగ్ కేంద్రం పరిశీలనకు వచ్చిన టీఆరెస్ నాయకుడు కౌశిక్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయడానికి వచ్చావా అంటూ… అడ్డుకునేందుకు ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలు. ఐతే… తాను ఎన్నికల సరళి పరిశీలించేందుకు వచ్చానంటూ… వారితో చెప్పినా… బీజేపీ కార్యకర్తలు వినలేదు. పరస్పరం వాదోపవాదాలు నడిచాయి. పోలీసుల ప్రొటెక్షన్ మధ్య అక్కడినుంచి… కౌశిక్ రెడ్డి వెళ్లిపోయారు.

ఉ.11 గం. వరకు 33.27% పోలింగ్ నమోదు

 

మలాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్, ఈటల జమున దంపతులు.

సాదుకున్నా మీరే, చంపుకున్నా మీరే. దర్మం గెలుస్తుంది. ప్రేమ అభిమానం ముందు డబ్బులు, మద్యం పని చేయవు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంటే మంచికి సంకేతం.ఈ రోజు వారి ఆత్మను ఆవిష్కరించి, గుండెళ్ళో గూడుకట్టుకున్న అభిమానాన్ని, ప్రేమని ఆవిష్కరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిచ్చేస్టం అయ్యింది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాలి. 90 శాతం పోలింగ్ అవుతుంది అని అనుకుంటున్న. – ఈటల రాజేందర్.

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES