Munugode : మునుగోడులో హుజురాబాద్ సీన్ రిపీట్.. అధికారపార్టీకి కొత్త లొల్లి!!

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పుడు అందరిచూపు మునుగోడు వైపే ఉంది.

  • Written By:
  • Updated On - October 10, 2022 / 08:17 AM IST

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పుడు అందరిచూపు మునుగోడు వైపే ఉంది. ఇక రాజకీయ పార్టీల విషయానికొస్తే…ఎవరికి వారు..తమదే గెలుపు అనే ధీమాలో ఉన్నాయి. ఆ విధంగానే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడులో ఇప్పుడు లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వార్ షురూ అయ్యింది. ఉపఎన్నికలో ప్రచారానికి ఇతన నియోజకవర్గాలకు చెందిన నేతలు రావాడం…అన్నీ తానై అన్నట్లుగా వ్యవహారిస్తుండటంతో స్థానికంగా ఉన్న నేతలకు అస్సలు నచ్చడం లేదు. స్థానిక నేతలకు గుర్తింపు కూడా తగ్గడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానిక నేతలను కలుపుకుని ముందుకు సాగాలంటూ టీఆర్ఎస్ అధిష్టానం సూచించింది. అయినప్పటికీ వారి మధ్య సయోధ్య కుదరడం లేదు. ప్రతి వెయ్యిమంది ఓటర్లకు ఒక కోఆర్డినేటర్ ను ఎమ్మెల్యే తమ అనుచరులను నియమించారు. దీంతో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ నేతల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు ఇది హుజురాబాద్ ఉపఎన్నిక సీన్ మునుగోడులోనూ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

స్థానిక నేతలకు అవమానం
ఎంపీటీసీ ఇన్చార్జీగా పనిచేస్తున్న ఎమ్మెల్యేను అధిష్టానం నియమించింది. ఆ ఎంపీటీసీ పరిధిలో సుమారు 2500 నుంచి 3వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. వారిని కోఆర్డినేట్ చేసుకునేందుకు తమ ప్రధాన అనుచరులను వందమందికి ఒకరిని కోఆర్ధినేటర్ గా నియమించుకున్నారు ఎమ్మెల్యేలు. అయితే ఈ నియామకంలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో స్థానిక నేతల్లో అసహనం మొదలైంది. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రజల ముందుకు అలసు అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలదే హడావుడి నడుస్తోందంటూ గుస్సా అవుతున్నారు. స్థానిక నేతలు కేవలం ప్రచార బొమ్మలుగానే మారుతుండటంతో అవేదనకు గురవుతున్నారు. దీంతో లోకల్ నాన్ లోకల్ అనే తేడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పార్టీ గెలుపు పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని స్థానిక నేతలు అంటున్నారు. గతంలో హుజురాబాద్ లో ఇదే సీన్ రిపీట్ అయ్యింది.