Huzurabad: హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపెవరిది?

  • Written By:
  • Updated On - October 30, 2021 / 11:56 PM IST

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. ఇక ఫలితాల గూర్చి అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. హుజురాబాద్ ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో నవంబర్ 2న తేలనుంది. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అక్కడ 84.5 శాతం ఓటింగ్ పోలవగా ఈసారి శాతం నమోదయింది.

ఈ ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, మూడు ప్రధాన పార్టీల మధ్యలోనే రసవత్తరమైన పోటీ కనిపించింది. వేలాది ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అధికార టిఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. కానీ గెలిచిన అభ్యర్థి ఎవరైనా మెజార్టీ మాత్రం అతి తక్కువగానే ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు డబ్బులు,మద్యం విపరీతంగా పంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమకి తక్కువ డబ్బులు పంచారని కొందరు ఓటర్లు రోడ్లపైకి వచ్చి ధర్నా చేసిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో
హుజురాబాద్ లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయం పక్కన పెడితే, నైతికంగా అన్ని పార్టీలు ఓడిపోయినట్టే భావించాలి.