Huzurabad Results update: టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.

టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటెల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు.

  • Written By:
  • Updated On - November 2, 2021 / 11:31 PM IST

  • హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే రౌండ్ రౌండ్ కి బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

  • హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. నువ్వానేనా అంటూ సాగిన పోరులో ఈటల సత్తాచాటారు. 20వ రౌండ్ ముగిసే సమయానికి ఆయన 21 వేల మెజార్టీ సాధించి హుజూరాబాద్ లో తనకు తిరుగులేదని చాటిచెప్పారు.
  • ఎంతో ఉత్కంఠ రేపిన హుజారాబాద్ ఎన్నికల్లో ఈటల గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. వరుసగా 18, 19 రౌండ్స్ లోనూ ఈటలదే హవా నడుస్తోంది. 19వ రౌండ్ లో 3047 ఓట్లతో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది.
  • 16, 17 రౌండ్స్ లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సత్తా చాటారు. 17వ రౌండ్ లో బీజేపీకి 1423 ఓట్లు వచ్చాయి.
  • రౌండ్ రౌండ్ కు ఈటల దే పైచేయి. 15వ రౌండ్ ముగిసే సమయానికి 2419 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
  • 14వ రౌండ్ లో బీజేపీ ముందంజలో నిలిచింది. ఈ రౌండ్ ఈటలకు 1046 ఓట్లు వచ్చాయి.
  • 11వ రౌండ్ టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలవగా, 12 వ రౌండ్ లో బీజేపీ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. 1217 ఓట్లతో లీడింగ్ లో ఉంది.
  • హుజూరాబాద్ కౌంటింగ్ లో ఈటల ముందున్నారు. 10వ రౌండ్ ముగిసేవరకు ఆయన 526 ఓట్లతో ఆధిక్యంలో నిలిచారు.
  • 9వ రౌండ్ లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించించింది. ఈ రౌండ్ లో 1835 ఓట్లతో లీడింగ్ లో ఉంది.
  • ఇప్పటివరకు ప్రతిరౌండ్ లో ఈటల ఆధిక్యం ప్రదర్శించగా, ఎనిమిదో రౌండ్ లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు ముందంజలో ఉన్నారు. 162 ఓట్లతో లీడ్ లో ఉన్నారు.
  • హుజూరాబాద్ కౌంటింగ్ నడుస్తోంది. ప్రస్తుతం ఏడో రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 3,432 ఓట్లతో లీడింగ్ లో ఉంది.
  • బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరో రౌండ్ లోనూ తన సత్తాను చాటారు. ఈ రౌండ్ ముగిసేవరకు బీజేపీ 2971 ఓట్లతో లీడ్స్ లో ఉంది.
  • ఐదు రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. 2169 ఓట్లు వచ్చాయి.
  • మొదటి రౌండ్ లో బీజేపీకి 4610, టీఆర్ఎస్ కు 4444, కాంగ్రెస్ కు 119 ఓట్లు వచ్చాయి.
  • రెండవ రౌండ్లో బీజేపీ 4947, టీఆర్ఎస్ 4769, కాంగ్రెస్ 220 ఓట్లు సాధించాయి.
  • మూడో రౌండ్లో కూడా బీజేపీ 911ఓట్ల ఆధిక్యంలో, నాలగవ రౌండ్లో 1273 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
  • టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రవేశ పెట్టిన శాలపల్లి గ్రామంలోనూ వెనుకంజలో నిలిచింది. ఈటెలకు వ్యతిరేకంగా కనబడ్డ హుజురాబాద్ టౌన్ లో కూడా టీఆర్ఎస్ వెనుకంజలోనే ఉంది.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES