Hussainsagar : రేపు హైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..

రేపుహైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..ఇప్పటికే మహానగరంలో ఎన్నో ప్రదేశాలు పర్యటకులను ఆకట్టుకుంటుండగా..ఇప్పుడు హుస్సేన్ సాగర్ అందానికి కోహినూర్ అద్దినట్టుగా.. అత్యాధునిక సాంకేతికతతో దేశ చరిత్రలోనే మొట్టిమొదటిసారి వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్‌పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో ‘కోహినూర్’ వజ్రం గురించిన కథను కూడా వివ‌రించ‌నున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే […]

Published By: HashtagU Telugu Desk
Hussainsagar Is Laser Based

Hussainsagar Is Laser Based

రేపుహైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..ఇప్పటికే మహానగరంలో ఎన్నో ప్రదేశాలు పర్యటకులను ఆకట్టుకుంటుండగా..ఇప్పుడు హుస్సేన్ సాగర్ అందానికి కోహినూర్ అద్దినట్టుగా.. అత్యాధునిక సాంకేతికతతో దేశ చరిత్రలోనే మొట్టిమొదటిసారి వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్‌పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో ‘కోహినూర్’ వజ్రం గురించిన కథను కూడా వివ‌రించ‌నున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ.. భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసిన ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్‌పై రంగుల రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు. ఈ కథను రాజ్యసభ ఎంపీ, సినీ రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో.. ప్రముఖ రచయిత ఎస్ఎస్ కంచి రాశారు. ప్రముఖ సింగర్ సునీత తన గాత్రాన్ని అందించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ.. సౌండ్ అండ్ లైట్ షోస్ ఉన్నాయి. ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి కావటం విశేషం.

కోహినూర్ కథతో పాటుగా.. తెలంగాణ కథ, సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ఈ షో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోనుంది. లేజర్ షోను వీక్షించేందుకు 800 నుంచి 1000 మంది పర్యటకులు కూర్చునేలా.. అన్ని వసతులతో కూడిన గ్యాలరీని ఏర్పాటు చేశారు.

Read Also : Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్

  Last Updated: 11 Mar 2024, 11:48 PM IST