Site icon HashtagU Telugu

Hussain Sagar : నిండుకుండలా హుస్సేన్ సాగర్.. 2 గేట్లు ఎత్తివేత

Hussain Sagar Reaches Full

Hussain Sagar Reaches Full

హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ (Hussain Sagar) కు భారీగా వరద నీరు చేరుతుండడం తో నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాధారణంగా హుస్సేన్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 514 అడుగులు. పూర్తిగా జలాశయం నిండిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూకట్‌పల్లి, బంజార, బుల్కాపూర్‌ నాలాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో హుస్సేన్‌ సాగర్‌ 2 గేట్లను అధికారులు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవేళ సాగర్‌కు వరద ఉధృతి పెరిగితే వెంటనే ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై జిహెచ్‌ఎంసి అధికారులు పరిశీలన చేపట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

గత నాల్గు రోజులుగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో భారీ వర్షాలు (Rains) కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల దాటికి వాగులు , వంకలు , చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల చెరువులు తెగి పలు ఊర్లను ముంచెత్తుతున్నాయి. ఇక రవాణా వ్యవస్థ కూడా స్థంభించింది. స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాంతో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గడిచిన 24గంటల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Read Also : Suryakumar Yadav first post : టీ20 కెప్టెన్ అయ్యాక‌.. సూర్య‌కుమార్ యాద‌వ్ తొలి పోస్ట్ వైర‌ల్‌..