CM Revanth – Davos : సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటనలో ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన దావోస్‌కు వెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబుకు ఎన్ఆర్ఐలు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. ఈ నెల 18 వరకు దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీల ప్రముఖులతో భేటీ అయి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పలు కంపెనీ ప్రతినిధులను రేవంత్ రెడ్డి కలిశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతోనూ(CM Revanth – Davos) సమావేశమయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల వాతావరణంపై ఆయనకు రేవంత్ వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్‌కు తెలిపారు. తమ ప్రభుత్వం పెట్టబడిదారులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు. ఇక ఇథియోఫియా డిప్యూటీ పీఎం డెమెక్ మెకోనెన్‌తోనూ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై ఆయనకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగే అత్యున్నత స్థాయి సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశంపై సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన ‘డెవలపింగ్ స్కిల్ ఫర్ ఏఐ’లో రేవంత్ మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలతో పాటు ప్రవాస భారత పారిశ్రామికవేత్తలను సీఎం కలుస్తారు. కాగా, సీఎం రేవంత్ సూట్‌లో తొలిసారి కొత్త లుక్‌లో కనిపించారు. ఆయన స్విట్జర్లాండ్ వెళ్లడం ఇదే తొలిసారి.
Also Read: Iran Strike : యుద్ధరంగంలోకి ఇరాన్.. ఇరాక్‌లోకి ఇజ్రాయెలీ స్పై కేంద్రాలపై ఎటాక్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఇప్పటికే ప్రారంభమైంది. 2024-25 బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించింది. బడ్జెట్ కసరత్తులో భాగంగా అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రులు, అధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రోజుకు ఇద్దరు చొప్పున మంత్రులకు సంబంధించిన శాఖలతో డిప్యూటీ సీఎం సమావేశం జరగనుంది.