అమ్మాయిలు, ఆంటీలు జరజాగ్రత్త.. అలర్ట్ కాకుంటే అంతే?

అమ్మాయిలు, మహిళలు జర జగ్రత్తగా ఉండండి.. ఏదైనా పని మీద బయటకు వెళ్తే అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే.. లేదంటే ఎవరినైనా తోడుగా తీసుకెళ్లండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న మాయమైపోతారు.

  • Written By:
  • Publish Date - October 18, 2021 / 05:06 PM IST

అమ్మాయిలు, మహిళలు జర జగ్రత్తగా ఉండండి.. ఏదైనా పని మీద బయటకు వెళ్తే అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే.. లేదంటే ఎవరినైనా తోడుగా తీసుకెళ్లండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న మాయమైపోతారు. తెలంగాణ రోజురోజుకూ అక్రమ రవాణా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా లైంగిక అక్రమ రవాణాలో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇటీవల విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం.. తెలంగాణ పోలీసులు 184 కేసులను నమోదు చేస్తున్న మానవ అక్రమ రవాణా సిండికేట్లపై విప్‌ను ఛేదించారు. ఇతర రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర కూడా అక్రమ రవాణాదారులపై 184 కేసులు నమోదు చేసింది. ఇక పొరుగు రాష్ట్రమైన ఏపీలో 171 కేసులు, దేశవ్యాప్తంగా మొత్తం 1,651 కేసులు నమోదైనట్టు సమాచారం.

పెరుగుతున్న నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీస్ యాంత్రాంగం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలను ఏర్పాటు చేసింది. ఈ విషయమై మహిళ భద్రతాధికారి సుమతి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా ఉన్నాయి. తరచుగా సమాచారం సేకరిస్తున్నాం. ఎప్పటికప్పుడు సహాయక జరుగుతున్నాయి. దాడులను అరికట్టేందుకు ఎన్నో బృందాలు పనిచేస్తున్నాయని వివరించారు.

గత సంవత్సరం 401 మంది మహిళలు, 37 మంది వ్యక్తులను మానవ అక్రమ రవాణా నుంచి పోలీసులు రక్షించారు. 401 మంది మహిళలలో అత్యధికంగా 363 మంది వ్యభిచార కూపం నుంచి కాపాడారు. 2019లో 137 కేసులు నమోదు చేయగా, 2018 లో మొత్తం 242 కేసులు నమోదయ్యాయి. సుమారు 98 శాతం కేసులలో ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా మహిళలకు, యువతకు ఎర వేస్తున్నారు. ఏవో ఆశలు చూపి అక్రమ రవాణా చేస్తున్నారు. కఠిన చట్టాలు అమలుచేస్తున్నా అక్రమ రవాణ మాత్రం ఆగకపోవడం గమనార్హం.